మెగా కోడలు ఉపాసన ( Upasana ) కామినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ప్రముఖ బిజినెస్ ఉమెన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఉపాసన కామినేని అపోలో హాస్పిటల్( Apollo Hospital ) బాధ్యతలను ఎంతో చక్కగా వ్యవహరిస్తూ బిజినెస్ పరంగా కూడా సక్సెస్ అందుకున్నారు.ఇక ఉపాసన తాతగారు డాక్టర్ సి ప్రతాపరెడ్డి( Prathap Reddy ).అపోలో హాస్పిటల్స్ కు చైర్పర్సన్ గా వ్యవహరిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్తగా కూడా గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా వ్యాపార రంగంలో ఎంతో మంచి సక్సెస్ సాధిస్తూ ఇప్పటికే టాప్ 100 బిలియనీయర్ల జాబితాలో ప్రతాప్ రెడ్డి చోటు సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇటీవల, ఐ.ఐ.ఎఫ్.ఎల్ వెల్త్ హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 ను ప్రకటించింది.మొదటి వందమంది బిలియనీర్ల జాబితాను విడుదల చేశారు.ఈ జాబితాలో ఉపాసన కుటుంబం 78 వ స్థానంలో ఉంది.ఇందులో ఉపాసన ఫ్యామిలీ ఆస్తుల విలువ సుమారు 21,000 కోట్ల రూపాయలని తెలుస్తోంది.ఉపాసన గారి తాతగారి సంపాదన ఏకంగా 169 శాతం పెరిగినట్లు తెలుస్తుంది.
ఇలా మీరు ఆర్థిక పరంగా ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎంతో అభివృద్ధి చెందారని తెలుస్తోంది.

ఇక తన తాతయ్య అపోలో హాస్పిటల్ చైర్పర్సన్ గా వ్యవహరించగా ఉపాసన సైతం అపోలో హాస్పిటల్ బాధ్యతలను చూసుకుంటూ ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు.హాస్పిటల్ బాధ్యతలను చూసుకోవడమే కాకుండా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్నారు.మరోవైపు సోషల్ మీడియా( Social media )లో ఎంతో యాక్టివ్ గా ఉండే ఉపాసన తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
ఇలా ఓ పారిశ్రామికవేత్త మనవరాలిగా పేరు సంపాదించుకున్నటువంటి ఉపాసన మరో స్టార్ హీరో కోడలిగాను పాన్ ఇండియా స్టార్ భార్య గాను కూడా గుర్తింపు పొందారు.
.