భారత జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా( Jasprit Bumrah ) సతీమణి సంజనా గణేశన్( Sanjana Ganeshan ) ఇటీవలే పండంటి మగ బిడ్డకు జన్మ ఇవ్వడంతో బుమ్రా కుటుంబంలో ఆనందం నెలకొంది.తాను తండ్రి అయిన విషయాన్ని బుమ్రా సోషల్ మీడియా వేదికగా వెల్లడించి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
తండ్రైన బుమ్రా ను అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు.అలాగే తమ కుమారుడికి అంగద్ జస్ప్రీత్ బుమ్రా అని పేరు పెట్టారు.
అయితే పాకిస్తాన్ క్రికెటర్ షాహిన్ ఆఫ్రిది, బుమ్రాకు శుభాకాంక్షలు తెలియజేసి, స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు.
ఆదివారం ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య మొదలైన మ్యాచ్ వర్షం కారణంగా మ్యాచ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.మ్యాచ్ ఆగిన తర్వాత పాకిస్తాన్ ఆటగాడైనా షాహిన్ ఆఫ్రిది,( Shaheen Afridi ) బుమ్రా దగ్గరకు వచ్చి శుభాకాంక్షలు తెలిపాడు.అంతేకాకుండా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి బుమ్రా ను ఆశ్చర్యపరిచాడు.
ఆ తర్వాత ముబారక్ బుమ్రా, దేవుడు మిమ్మల్ని ఎప్పుడు సంతోషంగా, క్షేమంగా చూడాలి.అని చెప్పడం జరిగింది.
తమ కుమారుడిని మరో కొత్త బుమ్రా గా తయారు చేయాలని షాహిన్ ఆఫ్రిది తెలిపాడు.తర్వాత ఇద్దరూ ఒకరినొకరు హగ్ చేసుకున్నారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది.ఆటగాళ్ల మధ్య ఇలాంటి క్రీడా స్ఫూర్తి ఉండాలని క్రికెట్ అభిమానులు ఈ ఆటగాళ్లను ప్రశంసిస్తున్నారు.
ఇక భారత్ – పాకిస్తాన్( India vs Pakistan ) మ్యాచ్ విషయానికి వస్తే.ఆదివారం 24.1 ఓవర్లకు రెండు వికెట్లను కోల్పోయి భారత్ 147 పరుగులు చేశాక వర్షం కారణంగా మ్యాచ్ సోమవారానికి వాయిదా పడింది.మ్యాచ్ మధ్యాహ్నం 3:00 గంటలకు పున ప్రారంభం అవ్వనుంది.