కొత్త బాధ్యతలను స్వీకరించిన చరణ్ భార్య.. ఏమైందంటే..?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ భార్యగా ఉపాసన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఉపాసన అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ గా ఉన్నారు.

అయితే ఉపాసన ఇప్పటికే తీసుకున్న బాధ్యతలకు అదనంగా కొత్త బాధ్యతలను స్వీకరించారని తెలుస్తోంది.ఉపాసన సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు.

ఉపాసన ఫారెస్ట్ ఫ్రంట్ లైన్ హీరోస్ ప్రోగ్రామ్ కు వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఇండియా అసోసియేషన్ తరపున ఎంపిక కావడం గమనార్హం.అధికారంగా ఈ మేరకు ప్రకటన వెలువడగా ఉపాసన స్పందిస్తూ కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజల ప్రాణాలను కాపాడటం కొరకు ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎంతో కష్టపడుతున్నారని ఉపాసన అన్నారు.

అటవీ క్షేత్ర సిబ్బంది అడవులలోని వన్యప్రాణులను సంరక్షించడానికి రేయింబవళ్లు పని చేస్తున్నారని ఉపాసన పేర్కొన్నారు.

Advertisement

అటవీ సిబ్బంది అడవులలో పెట్రోలింగ్ చేయడం కొరకు 15 నుంచి 20 కిలోమీటర్లు నడుస్తున్నారని ఉపాసన చెప్పుకొచ్చారు.జంతువుల నుంచి వేటగాళ్ల నుంచి అటవీ సిబ్బంది ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని ఉపాసన వెల్లడించారు.అలాంటి హీరోలకు రాయబారిగా పని చేయడం తనకు సంతోషంగా ఉందని ఉపాసన తెలిపారు.

తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఉపాసన వెల్లడించారు.

కొన్ని రోజుల క్రితం నాగబాబు సైతం ఉపాసన గొప్పదనాన్ని మెచ్చుకున్న సంగతి సంగతి తెలిసిందే.అన్నకు తగ్గ కోడలు ఉపాసన అని తక్కువ ధరకే అపోలో ఆస్పత్రిలో ఉపాసన కరోనా చికిత్స అందించారని నాగబాబు అన్నారు.ఎందుకు ఇంత తక్కువకే చికిత్స అందిస్తున్నావని ఉపాసనను అడగగా ఇలాంటి సమయంలోనే పదిమందికి ఉపయోగపడాలని ఉపాసన చెప్పిందని నాగబాబు వెల్లడించారు.

చిరంజీవి కూడా ఉపాసన ద్వారా కష్టాల్లో ఉన్న ఎంతోమందిని ఆదుకున్నారని నాగబాబు ఉపాసన గొప్పదనం గురించి చెప్పుకొచ్చారు.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు