రాయక నిర్మాతల్ని, రాసి ప్రేక్షకుల్ని ఏడ్పించిన మనసుకవి ఆత్రేయ..

ఆత్రేయ.ఈ మాట వినగానే మనసు కవి అంటారు జనాలు.

ఆయన చక్కటి మాటకారి.

అంతకు మించి పాటకారి.

అంతేనా.ఓ నటుడు, దర్శకుడు, నిర్మాత, జర్నలిస్టు కూడా.

ఆయన ఏం చేసినా ప్రేక్షకుడి మనసుకు సూటిగా తాకుదుంది.ఆయన చేతిలో పదాలు అలా రాలిపోతాయి.

Advertisement

ఆయన కలం నుంచి జాలువారే అక్షరాలు అద్భుతంగా ఒదిగిపోతాయి.ఆయన రాతలతో చేసిన ప్రయోగాలన్నీ.

జనాల మనుసుల్లో భద్రంగా దాగిపోయేవే.మాటలను పాటలుగా మలిచి.

మనుసు కవిగా నిలిచిపోయిన ఆత్రేయ శతజయంతి సందర్భంగా ఆయనను మరోసారి గుర్తు చేసుకుందాం.ఆత్రేయ.

పొడి మాటలనే పాటలుగా మలుస్తాడు.అవే మన మనసును తడిపివేస్తాయి.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

ఆయన మాటలు, పాటలు ఏవైనా సరే అచ్చ తెలుగులో అందరికీ అర్థం అయ్యేలా ఉంటాయి.నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట తాలూకాలోని ఉచ్చూరు అనే మారుమూల గ్రామంలో 19821లో జన్మించాడు ఆత్రేయ.

Advertisement

తన అసలు పేరు కిళాంబి వెంకట నరసింహా చార్యులు.మరి ఆత్రేయ ఎవరు? ఈ పేరు ఎందుకు వచ్చింది? అంటే ఆయన గోత్రం ఆత్రేయ అట.ముందుగా నాటకాలు రాస్తూ.నాటక రచయితగా మారాడు.

అనంతరం పాటల రచయితగా మారాడు.నాలుగు దశాబ్దాల పాటు సుమారు 14 వందల పాటలు రాశాడు ఈ మహా కవి.

తేలిక మాటలతో బరువైన భావాన్ని కలిగించేవాడు ఆత్రేయ.అందుకే తెలుగు సినిమా పాటకు మనసు కవిగా ముద్ర వేసుకున్నాడు.రాయక నిర్మాతల్ని, రాసి ప్రేక్షకుల్ని ఏడ్పిస్తాడు అనే అపవాదు ఉంది ఆత్రేయకు.

అప్పట్లో ఆయన తమ సినిమాలకు పాటలు రాయడం గౌరవంగా భావించేవారు నిర్మాతలు.ఆయన పాటలు విని మనసారా ఏడ్చి ఆనందించేది జనాలు.

గొప్ప నాటక రచయిత.గొప్ప సినిమా పాటల రచయితా మారి.

తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నాడు.మనసు కవిగా.

మన సుకవిగా పేరు పొందాడు.పాటల రచయితగా ఎనలేని గుర్తింపు పొందాడు.

జనాల ఆదరణ దక్కించుకున్నాడు.

తాజా వార్తలు