సినిమాటోగ్రాఫర్ కె.కె.
సెంథిల్ కుమార్ పేరు చెప్పగానే అందరికి గుర్తచ్చేది బాహుబలి సినిమా లేదంటే రాజమౌళి సినిమాలు.ఎందుకంటే అయన అన్ని సినిమాలకు కేవలం సెంథిల్ మాత్రమే పని చేస్తాడు కాబట్టి.
ఇక ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గొప్పగా చెప్పుకుంటున్న ఈ సినిమాల గురించి మాత్రమే అందరు చెప్పుకుంటున్న అయన ఒకప్పుడు అమృతం అనే సీరియల్ కి కెమెరా మెన్ అనే విషయం చాల మందికి తెలియదుల.ఆలా ఒక సీరియల్ కి మొదట కెమెరా మెన్ గా ప్రారంభించి ఇప్పుడు టాప్ పొజిషన్ కి చేరుకున్నాడు సెంథిల్ కుమార్.
సెంథిల్ గురించి ఇప్పుడు కొన్ని విషయాలను తెలుసుకుందాం.
సెంథిల్ కి చిన్నతనం నుంచి క్రికెటర్ అవ్వాలనే కోరిక బలం గా ఉండేది.
మంచి ఆటగాడు కూడా.కానీ అనుకోకుండా స్నేహితుడి సలహా మేరకు పూణే లో సినిమాటోగ్రఫీ పైన మూడేళ్ళ కోర్స్ చేసి కొన్నాళ్లపాటు ఖాలీగానే ఉనాన్డు సెంథిల్.
ఆలా మొదట ప్రేమకు వేళయరా సినిమాకు కెమెరా మెన్ గా పని చేసి ఆ తర్వాత అమృతం సీరియల్ కోసం పని చేసాడు.ఈ సినిమాకు దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటి.
సెంథిల్ పనితనం నచ్చి అయన తీసిన అయితే సినిమాకు కూడా సెంథిల్ చేత సినిమాటోగ్రఫీ చేయించాడు.ఆ తర్వాత రాజమౌళి దగ్గరకు చేరి సై సినిమాతో తన జర్నీ స్టార్ట్ చేసాడు.

అప్పటి నుంచి నేటి వరకు రాజమౌళి అన్ని సినిమాలకు సెంథిల్ సినిమాటోగ్రఫీ చేస్తున్నాడు.రాజమౌళి సినిమాలతో పాటు ఇన్నేళ్ల తన కెరీర్ లో సెంథిల్ చేసింది కేవలం 16 సినిమాలు మాత్రమే.అయినా కానీ వరల్డ్ టాప్ సినిమాటోగ్రాఫర్ గా అవతరించాడు సెంథిల్.అందుకు కారణం రాజమౌళి అని చెప్పక తప్పదు.ఒక్కప్పుడు సీరియల్ తో మొదలైన అతడి ప్రస్థానం ఈ రోజు ఈ స్థాయిలో వుంది.ఇక సెంథిల్ వ్యక్తిగత విషయానికి వస్తే రోహిణి అనే యోగ టీచర్ ని పెళ్లి చేసుకున్నాడు సెంథిల్ కుమార్.
ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు.







