టాలీవుడ్ జక్కన రాజమౌళి దర్శకత్వం లో మహేష్ బాబు హీరో గా ఒక సినిమా రూపొందబోతున్న విషయం తెలిసిందే.రాజమౌళి సినిమా అనగానే కనీసం రెండు నుండి మూడు నాలుగు సంవత్సరాల సమయం పడుతుందని అంత భావిస్తున్నారు.
కానీ మహేష్ బాబు తో తీయబోతున్న సినిమా కు అంత సమయం తీసుకోను అంటూ రాజమౌళి పదే పదే చెప్తున్నాడు.తాజాగా మరో అప్డేట్ ని రాజమౌళి ఇచ్చాడు.
ఒక మీడియా సంస్థ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో రాజమౌళి మాట్లాడుతూ ప్రస్తుతం మా నాన్నగారు విజయేంద్ర ప్రసాద్ మరియు కజిన్స్ తో కలిసి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లుగా పేర్కొన్నాడు.తాను ఎప్పటి నుండో అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా ను తీయాలని కోరుకుంటున్నాను.
ఇండియానా జోన్స్ లో సినిమా ఉండబోతుంది అన్నట్లుగా రాజమౌళి పేర్కొన్నాడు.
ఇప్పటి వరకు ఇండియన్ సినిమా స్క్రీన్ పైన కనిపించని విభిన్నమైన యాక్షన్ అడ్వెంచర్స్ సన్నివేశాలను చూపించబోతున్నట్లుగా కూడా రాజమౌళి ప్రకటించాడు.
స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టినట్లుగా ప్రకటించిన రాజమౌళి అతి త్వరలోనే సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలు కూడా మొదలవుతాయని ప్రకటించాడు.వచ్చే ఏడాది మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న త్రివిక్రమ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వం లో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ నమోదు చేసే విధంగా ఈ సినిమా ను రాజమౌళి రూపొందించబోతున్నాడు.
ఒక ఇండియన్ సినిమా అన్నట్లుగా కాకుండా హాలీవుడ్ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మహేష్ బాబు తో సినిమా ను జక్కన్న రూపొందించబోతున్నాడు.రాజమౌళి ఏ సినిమా తీసినా కూడా అధ్బుతమే.
కనుక ఈ సినిమా అంతకు మించి ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.







