ఎన్టీఆర్ కి తొలి డ్యాన్స్ మాస్టర్ అయినా ముక్కు రాజు గురించి మీకు తెలుసా ?

ముక్కు రాజు అలియాస్ సాగిరాజు రాజంరాజు. ముక్కు రాజు అంటే ఎవరో ఈ తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు.

 Untold Facts About Actor Mukku Raju Details, Mukku Raju, Actor Mukku Raju, Dance-TeluguStop.com

కానీ ఈయన సీనియర్ ఎన్టీఆర్ కి తొలిసారి డాన్స్ అంటే ఏంటో నేర్పిన మాస్టర్, అలాగే చిరంజీవికి సైతం తొలి సినిమాలుగా ఉన్న ప్రాణం ఖరీదు, పునాదిరాళ్లు, మన ఊరి పాండవులు సినిమాలకు ముక్కు రాజు డాన్స్ కంపోజ్ చేసి మాస్టర్ గా వ్యవహరించారు.ముక్కు రాజు ఎక్కువగా ఆర్ నారాయణమూర్తి నిర్మించిన సినిమాల్లో కనిపించేవారు.

అయన డప్పు కొడుతూ ఉగ్రతాండవం చేస్తుంటే కన్నుల పండుగగా ఉండేది.

ఇక 1931లో భీమవరం దగ్గరలో ఉన్న కుముదవల్లిలో వ్యవసాయాన్ని మాత్రమే నమ్ముకున్న ఒక మధ్య తరగతి కుటుంబంలో ముక్కు రాజు జన్మించారు.

బ్రిటిష్ వారు నేర్పిస్తున్న చదువులను వద్దనుకొని క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 1941లో పుస్తకాలను విసిరేసిన ఘనత ముక్కు రాజు దక్కించుకున్నారు.కె.వి రెడ్డి 1955లో తీసిన మాయాబజార్ సినిమాతో మొదటిసారిగా సినిమాల్లో నటించడం ప్రారంభించాడు ముక్కు రాజు.ఆయన కెరియర్లో దాదాపు 500 సినిమాల్లో పనిచేశారు అందులో 200 సినిమాలకు డాన్స్ మాస్టర్ గా పనిచేస్తే మిగతా సినిమాల్లో ఫైటర్ గా, యాక్టర్ గా కూడా కనిపించారు.

Telugu Oka Gramam, Mukku Raju, Chiranjeevi, Dancemaster, Mayabazar, Nandamuritar

ముక్కు రాజు హైదరాబాదులో ఒక డాన్స్ మాస్టర్ కోసం సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు.ఇక ఆర్ నారాయణ మూర్తి అంటే ముక్కు రాజుకు ప్రత్యేకమైన అభిమానం అందుకే ఆయన అన్ని సినిమాల్లో దాదాపుగా ముగ్గురు డాన్స్ మాస్టర్ గా పని చేస్తూ నటించేవారు.పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ తెలంగాణ ఉద్యమం కోసం తీసిన సినిమాల్లో చురుగ్గా నటించేవాడు ముక్కు రాజు. ఆయన నటనను గుర్తించింది మొదటిసారి మాత్రం 1940లో ఒక గ్రామం అనే చిత్రం ద్వారా.

Telugu Oka Gramam, Mukku Raju, Chiranjeevi, Dancemaster, Mayabazar, Nandamuritar

ఈ సినిమాలో వైదవ్యం లో ఒక యువతిని వివాహం చేసుకొని పడక సుఖం ఇవ్వలేని భర్తగా, చివరికి ఆమె వేరొక వ్యక్తితో తల్లి అయితే ఆ బిడ్డను దగ్గర తీసుకునే వ్యక్తిగా కనిపించి అద్భుతంగా నటించారు.ఈ సినిమాలో ముక్కు రాజు నటన మాత్రమే హైలైట్ అని చెప్పుకోవచ్చు.అంతేకాదు ఈ సినిమాకు గాను ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు సైతం అందుకున్నారు.ఈ చిత్రానికి 2008 సంవత్సరానికి గాను ఉత్తమ జాతీయ అవార్డు కూడా దక్కడం విశేషం.2014 లో జూలై 31వ తేదీన ముక్కు రాజుగారు కన్నుమూశారు ఆయనకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె కూడా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube