తాతమ్మకల సినిమాతో తొలిసారిగా 14వ ఏటా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు బాలకృష్ణ. తండ్రి దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే తన కెరియర్ మొదలుపెట్టారు.
తన తండ్రి నటన వారసత్వాన్ని అందిపుచ్చుకొని తండ్రికి తగ్గ తనయుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు గడించారు.ప్రస్తుతం 62 ఏళ్ళ వయసున్న బాలకృష్ణ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన 48 ఏళ్లు కావస్తోంది.
ఇన్నేళ్ల బాలకృష్ణ కెరియర్ లో గల కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి 48 ఏళ్లు గడుస్తోంది.
ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత ఒక నటుడు ఇన్నేళ్లపాటు తన కెరీర్ ని కొనసాగించలేదు.ఇంకో రెండేళ్లు ఆగితే 5 దశాబ్దాలు కూడా బాలకృష్ణ పూర్తి చేసుకుంటారు.
ఈ రికార్డు ఈ మధ్య కాలంలో ఎవరు బద్దలు కొట్టే సమస్య లేదు.
ఇప్పటి వరకు బాలకృష్ణ 106 సినిమాల్లో నటించారు మరో రెండు సినిమాలు అతి త్వరలో పూర్తికానున్నాయి.
బాలకృష్ణ పేరా మరో రికార్డు కూడా ఉంది.ఆయన ఇప్పటివరకు ఏకంగా 120 మంది నటీమణులతో నటించారు.
బాలకృష్ణ సినిమాల్లో 200 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ సాధించిన సినిమాలు ఉండగా 10 లక్షల వసూలు చేసిన చిత్రాలు కూడా ఉన్నాయి .అఖండ సినిమా 200 కోట్లు రూపాయలు రాబట్టగా ఆయన కెరియర్లో ఇదే హైయెస్ట్ రికార్డ్.
ఇక బాలయ్యకు అభిమానులు కటౌట్స్ పెట్టడం అనేది సాధారణ విషయమే.10 ఫీట్ల కటౌట్ నుంచి 108 ఫీట్లు కటౌట్స్ వరకు ఉన్నాయి.ఇప్పటివరకు రికార్డ్ బ్రేక్ కట్ అవుట్ 108 ఫీట్లు గా ఉంది.
భారతదేశ సినీ చరిత్రలో వెయ్యి రోజులు ఆడిన సినిమాగా బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా ఉంది.
ఆయన కెరియర్ లో 100 రోజులు ఆడిన సినిమాల నుంచి 1000 రోజుల వరకు అనేకం ఉన్నాయి.
ఎన్టీఆర్ దర్శకత్వంలో 6 సినిమాల్లో నటించిన బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి డజనుకు పైగా సినిమాల్లో నటించాడు.
తండ్రితో కొన్ని సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన బాలయ్య హీరో అయ్యాక శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, బ్రహ్మశ్రీ విశ్వామిత్ర సినిమాల్లో కలిసి నటించారు.
దాదాపు 5 దశాబ్దాల సినీ చరిత్ర ఉన్న బాలయ్య జానపదం, పౌరాణికం, సాంగీకం, చారిత్రకం, సోషియో ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ వంటి అన్ని సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు.
ఇక అత్యధిక సినిమాలు దర్శకుడు కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ నటించారు.అవి 13 సినిమాలు కాగా అందులో తొమ్మిది సినిమాలు హిట్టు కొడితే, నాలుగు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.