ఎప్పుడైనా సడెన్‌గా ఏదైనా మీటింగ్ కి లేదా డేట్ కి లేదా పార్టీ కి వెళ్లాల్సి వచ్చినప్పుడు ముఖం డల్ గా ఉంటే ఇక వారి బాధ వర్ణనాతీతం.అసలు బయటకు వెళ్లాలి అన్న మూడు, ఉత్సాహం రెండు పోతాయి.
అయితే అలాంటి టైం లో ఇప్పుడు చెప్పబోయే రెండు సింపుల్ చిట్కాలు ప్రయత్నిస్తే క్షణాల్లో మీ ముఖం గ్లోగా మరియు అట్రాక్టివ్ గా మారుతుంది.మరి ఇంతకీ ఆ రెండు చిట్కాలు ఏంటి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసుకుని బాగా మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చూసి వేళ్ళతో సున్నితంగా ఐదు నుంచి పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.
ఆ తర్వాత మరో గిన్నెను తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి, వన్ టేబుల్ స్పూన్ టమాటో జ్యూస్ మరియు సరిపడా హోమ్ మేడ్ బాదం పాలను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి కాస్త మందంగా ఏదైనా బ్రష్ సహాయంతో అప్లై చేసుకోవాలి.

ఇరవై నిమిషాల అనంతరం వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఈ రెండు సింపుల్ చిట్కాలను పాటిస్తే చర్మం పై పేరుకుపోయిన మృత కణాలు, మురికి, అధిక జిడ్డు తొలగిపోతాయి.డల్ నెస్ పోయి ముఖ చర్మం గ్లోయింగ్‌గా మరియు అట్రాక్టివ్ గా మారుతుంది.సడెన్‌గా ఎక్కడికైనా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ రెండు చిట్కాలను పాటిస్తే ఇన్స్టంట్ ఫేస్ గ్లోను మీ సొంతం చేసుకోవచ్చు.