యాదాద్రి భువనగిరి జిల్లా: జిల్లాలో అనేక గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ( BRS party )కి గడ్డు కాలం మొదలైందనే చర్చ జోరుగా సాగుతోంది.ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చవిచుడడం,కాంగ్రెస్ పార్టీ( Congress party ) రాష్టంలో అధికారం చేపట్టడంతో మాజీ ఎమ్మెల్యేలు తీవ్ర నిరాశకు గురైన విషయం తెలిసిందే.
ఓడకొట్టిన ప్రజల మీద కోపమో లేదంటే ఇంకే కారణమో తెలీదు కానీ,ప్రజలను మాత్రం గులాబీ లీడర్లు కలవడం లేదనే టాక్ నడుస్తోంది.అధికారంలో ఉన్నప్పుడు హడావిడి చేసిన ఎమ్మెల్యేలు ఓడిపోయిన తర్వాత మొఖం చాటేయడం పట్ల గులాబీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఓటమి చెందినా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల మంచి చెడులు తెలుసుకొని ప్రతిపక్ష పాత్ర పోషించాలని,కానీ,ఇలా కనిపించకుండా ఏమిటని స్థానిక లీడర్లను ప్రశ్నిస్తున్నారు.వీరికి పదవులే తప్పా ప్రజలు బాగోగులు పట్టవా అని అసహనం వ్యక్తం చేస్తూ గరమవుతున్నారట.
మాజీ ఎమ్మెల్యేలు,బీఆర్ఎస్ పార్టీ బాధ్యులు గ్రామాల్లో పర్యటించడం లేదని,క్యాడర్ ను అసలు పట్టించుకోవడం లేదని పలువురు కార్యకర్తలు పక్క చూపులు చూస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.అధికారంలో ఉన్నప్పుడు తమను వెంట తిప్పుకొని ఇప్పుడు కనీసం మందలించే వారు కరువయ్యారని,తమ దారి తాము చూసుకోవడం తప్ప చేసేదేమీ లేదని వాపోతున్నారట.
ఇదే పరిస్థితులు కొనసాగితే త్వరలో గ్రామాల్లో గులాబీ జెండా మాయవతుందని పలువురు పార్టీకి చెందిన దిగువశ్రేణి నాయకులు అభిప్రాయపడుతున్నారు.







