మరుగుదొడ్ల మ్యూజియం గురించి విన్నారా ఎప్పుడైనా మీరు..?!

నేటి ప్రపంచంలో వింతలు చాాలానే ఉన్నాయి.వాటిని ఇష్టపడేవారు, చూడాలనుకునేవారు కూడా చాలా మందే ఉన్నారు.

ఎక్కడైేనా ఏదైనా విచిత్రంగా కనిపిస్తే చాలు వెంటనే అక్కడికెల్లి చూసేయాలని అనిపిస్తుంది.అయితే తాజాగా ఓ విచిత్ర మ్యూజియం గురించి మీరు తెలుసుకోవాలి.

ఓ టాయిలెట్ మ్యూజియం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ఆ మ్యూజియంలో టాయిలెట్లే దర్శనమిస్తాయి.

భారత దేశంలో చాలా కుటుంబాలు ఇప్పటికీ కూడా టాయిలెట్లను వినియోగించడం లేదు.బహిర్భూమికే వారు టాయిలెట్లకు వెళుతున్నారు.

Advertisement

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరుగుదొడ్లు నిర్మించుకోవాలని అనేక పథకాలు ప్రవేశపెట్టినా చాలా మంది వాటిని అనుసరించడం లేదు.అందుకే వాటివల్ల అనారోగ్య పాలు అవుతున్నారు.

ఈ నేపథ్యంలోనే బిందేశ్వర్ పాథక్ అనే వ్యక్తి సులభ్ కాంప్లెక్స్ ను శ్రీకారం చుట్టారు.‘సులభ్ ఇంటర్నేషనల్’ పేరుతో దేశంలో వాటి గురించి అందరికీ అవగాహన కలిగించాడు.1992వ సంవత్సరం ఢిల్లీలో టాయిలెట్ మ్యూజియాన్ని నిర్మించాడు.అనేక రకాల మరుగుదొడ్లను ఆ మ్యూజియంలో ఎగ్జిబిషన్ గా ఏర్పాటు చేశాడు.

ఆ మ్యూజియమే ఇప్పుడు ప్రపంచ వింతల్లో ఒకటిగా విరాజిల్లుతోంది.ఆ మ్యూజియంలో క్రీస్తుకు పూర్వం నుంచి ఉండే మరుగుదొడ్లు దర్శనమిస్తాయి.50 దేశాలకు చెందిన వివిధ రకాల మరుగుదొడ్లు అందులో కనిపించడం విశేషం.

రోమన్ చక్రవర్తుల కాలంలోని బంగారం, వెండి మరుగుదొడ్లు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి.క్వీన్ ఎలిజిబెత్ చరిత్రలో ఉన్న మరుగుదొడ్ల రూపాలు మ్యూజియంలో భద్రపరిచాడు.అంతేకాదు హరప్పా నాగరికత ఉన్నటువంటి ఆ కాలంలోని మరుగుదొడ్ల వ్యవస్థ ఎలా ఉందో కళ్ల ముందు ఉంచాడు.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

ఆ మరుగుదొడ్ల విశేషాలను, చరిత్రను పుస్తకరూపంలో కూడా ఆయన వివరించి పెట్టాడు.ఇకపోతే మరుగుదొడ్లపై ఉంటే జోక్స్, కార్టూన్లను కూడా మ్యూజియంలో ఏర్పాటు చేశారు.దీని వల్ల అక్కడికి వచ్చే యాత్రికులు వాటిని చూసి వినోదాన్ని పొందుతున్నారు.

Advertisement

ప్రస్తుతం కరోనా వల్ల ఈ టాయిలెట్ మ్యూజియం చూడని పరిస్థితి ఉంది.

తాజా వార్తలు