గూఢచారి సినిమాలో నదియా పాత్రలో నటించిన నటి ఎవరో తెలుసా.? ఆమె గురించి ఈ విషయం తెలుస్తే షాక్ అవుతారు!  

Unknown Facts About Supriya Yarlagadda -

ఇటీవల విడుదలైన గూఢచారి సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఈ సినిమాతో అడవి శేష్ క్రేజ్ మరింత పెరిగింది.

ఈ సినిమాలో త్రినేత్ర ఆఫీసర్ “నదియా” పాత్రకూడా ముఖ్యమైంది.ఆ పాత్ర పోషించిన “సుప్రియ” ఎవరో తెలుసు కదా.? ఆమె గురించి ఈ విషయం తెలుస్తే ఆశ్చర్యపోతారు.ఆమె ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించారు.

గూఢచారి సినిమాలో నదియా పాత్రలో నటించిన నటి ఎవరో తెలుసా. ఆమె గురించి ఈ విషయం తెలుస్తే షాక్ అవుతారు-General-Telugu-Telugu Tollywood Photo Image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి హీరోయిన్ సుప్రియా చరణ్ రెడ్డి.అక్కినేని నాగేశ్వరావు పెద్ద కూతురు యార్లగడ్డ సత్యవతి కూతురు.

సుమంత్ కి అక్క.అంటే నాగార్జునకి స్వయానా మేనకోడలు.

తండ్రి యార్లగడ్డ సురేంద్ర ఒకప్పుడు పెద్ద నిర్మాత.

సుప్రియ తల్లిదండ్రులిద్దరూ మరణించారు.ఆ తర్వాత ఆమె అక్కినేని నాగే్శ్వరరావు సంరక్షణలోనే పెరిగింది.అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో ఆమెను హీరోయిన్ గా ఎలివేట్ చేయాలని అనుకున్నారు కానీ ఆమె హీరోయిన్ గా అంత సక్సెస్ అవ్వలేదు.

హీరోయిన్ గా నటించిన కొంత కాలానికి ఆమె చరణ్ అనే ఒక హీరోని ప్రేమించి పెళ్లిచేసుకుంది.శ్రీయా మొదటి సినిమా ఇష్టంలో హీరో అతడు.సుశాంత్ డెబ్యూ మూవీ కాళిదాస్ కు అతడే దర్శకుడు.

భర్త దర్శకుడిగా తనను తాను నిరూపించుకొనే ప్రయత్నంలో ఉండగా.సుప్రియా అన్నపూర్ణ స్డూడియోస్ వ్యవహారాలు చూసుకునేది.ఆ స్టూడియోకి ఆమే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ .తన వ్యాపార దక్షతతో స్టూడియోకు ఓ కార్పొరెట్ లుక్కును తెచ్చేశారు.కానీ స్టూడియోలో కొందరిపై చిన్నాపెద్దా తేడా లేకుండా మాట్లాడేస్తుంటారనే విమర్శలు వస్తున్నాయి.

అయితే తన ఉద్యోగంలో భాగంగానే ఆమె చాలా కఠినంగా వ్యవహరిస్తుందని ఆమెను దగ్గరనుంచి చూసినవారికి తెలిసిన సత్యం.పని విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించే ఆమె మాటలను భరించలేని కొందరు తమతమ చిత్రం షూటింగులను రామోజీ ఫిలిం సిటీకి మార్చేసుకుంటున్నారట.

‘గూఢచారి’ చిత్రంలో సుప్రియా యార్లగడ్డ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాదు సినిమా విజయంలో కీలకంగా మారింది.ఈ సందర్భంగా సినిమాకు వస్తున్న స్పందన గురించి సుప్రియా మాట్లాడుతూ-నా మొదటి సినిమా చేసి చాలా కాలమవుతోంది.

శశి కిరణ్‌, శేష్‌ నా దగ్గరకు వచ్చి కథ చెబుతున్నప్పుడు నా సలహా కోసం వినిపిస్తున్నారేమో అనుకున్నాను.కానీ కథ పూర్తయ్యాక ఇందులో మీరో పాత్రలో నటించాలి అన్నారు.

వాళ్లు సరదాగా అంటున్నారని అనుకున్నా గానీ ఈ కథకు, పాత్రకు మీరో సరిపోతారని నిర్ణయించుకున్నాం అన్నారు.నేను సినిమాలు మానేసి ఇన్నేళ్లయినా ఇంకా పవన్‌ నాయికే అంటున్నారు.

ఆయన ఈ స్థాయికి వస్తారని అనుకోలేదు అని చెప్పారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు