ఇటీవలి కాలంలో కొన్ని సినిమాలూ మొదటి రోజు మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఆ తర్వాత మాత్రం ఎందుకో సినిమా అనుకున్నంత మంచి వసూళ్లు సాధించలేక బాక్సాఫీస్ వద్ద డీలా పడి పోతూ ఉంటుంది.కానీ కొన్ని సినిమాలు మాత్రం మొదటి రోజు ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఆ తర్వాత ప్రేక్షకులను తెగ ఆకర్షిస్తూ భారీ వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధిస్తూ ఉంటాయి అని చెప్పాలి.
ఇక ఇలాంటి సినిమాలలో పుష్ప, సర్కారు వారి పాట సినిమాలు కూడా ఉన్నాయని చెప్పాలి.
అయితే ఇక ఈ రెండు సినిమాలు కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలోనే తెరకెక్కడం గమనార్హం.
కొంతమంది నిర్మాతలు సినిమా డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చేసిన తర్వాత ప్లాట్ టాక్ వస్తే పెద్దగా పట్టించుకోరు.కానీ మైత్రి మూవీ మేకర్స్ మాత్రం ఫ్లాప్ అస్సలు అంగీకరించరు అని అంటూ ఉంటారు.
అందుకే వీరి సినిమాలు మొదటి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా తర్వాత మాత్రం సూపర్ హిట్ అందుకుంటాయి.ఈ క్రమంలోనే పుష్ప సినిమా గత ఏడాది డిసెంబర్ 17 న విడుదలై మొదటి రోజు హిట్ టాక్ సొంతం చేసుకోలేదు.
ఏదో తేడాగా ఉంది ఏంటి అనుకున్నారు ప్రేక్షకులు.యావరేజ్ గురు అంటూ రివ్యూలు కూడా ఇచ్చేశారు.

ఆ సమయంలోనే మైత్రి మూవీ మేకర్స్ ప్రమోషన్స్ మరింత జోరుగా చేశారు.దీంతో ఇక ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది.బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఇప్పుడు ఈ సినిమా పార్ట్ 2 కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.ఇప్పుడు సర్కారీ వారి పాట సినిమా మొదటిరోజు ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా మైత్రి మూవీ మేకర్స్ భారీ ప్రమోషన్ చేశారు.
ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకుపోతోంది ఈ సినిమా.ఈ సినిమా విడుదలయ్యాక ప్రమోషన్ చేసిబ్లాక్ బస్టర్ హిట్టయ్యేలా చేయడం మరో ఎత్తు అంటూ మహేద కూడా మైత్రి నిర్మాతలపై ప్రశంసలు కురిపించారు అన్న విషయం తెలిసిందే.
ఏదేమైనా మైత్రి మూవీ మేకర్స్ తో సినిమా అంటే సూపర్ హిట్ ఖాయం అని అర్థమవుతుంది.







