వైసీపీ రాజ్యసభ అభ్యర్ధులు వీరే ? ఆయన ఎంపికపై పార్టీలో అసంతృప్తి ?

ఎట్టకేలకు వైసీపీ తరుపున రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు.మొత్తం నాలుగు స్థానాలు ఖాళీ కావడంతో ఆ స్థానాల్లో జగన్ ఎవరిని ఎంపిక చేస్తారు అనే విషయం పై చాలా రోజులుగా ఉత్కంఠత నెలకొంది.

 Who Are The Ycp Rajya Sabha Candidates Dissatisfaction In The Party Over His Cho-TeluguStop.com

ఈ రాజ్యసభ స్థానాలను దక్కించుకునేందుకు పార్టీ సీనియర్ నాయకులు.జగన్ కు అత్యంత సన్నిహితులైన వారు చాలా మంది పోటీ పడ్డారు.

కానీ వారెవరికీ ఆ అవకాశం దక్కలేదు.కొంతమంది పేర్లు ఊహించిందే అయినా.

మరికొంతమంది ఎంపికలో జగన్ గోప్యత పాటించారు.ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న విజయసాయి రెడ్డి కి మరోసారి జగన్ అవకాశం కల్పించారు.

అలాగే టీడీపీ నుంచి వైసీపీ లో చేరిన బీద మస్తాన్ రావు కు అవకాశం దక్కింది.

మరో స్థానంలో జగన్ అక్రమాస్తుల కేసులు వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డి.

నాలుగో పేరు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య.దాదాపు ఈ నలుగురి పేర్లను జగన్ ఖరారు చేశారు.

వీరి ఎంపికకు ముందే పార్టీ సీనియర్ నాయకులు కొంతమంది తో జగన్ సమావేశమే. ఈ 4 పేర్లను ఫైనల్ చేసినట్లు సమాచారం.

లాయర్ నిరంజన్ రెడ్డి తో పాటు, ఆర్.కృష్ణయ్య ప్రస్తుతం వైసిపి లో లేరు.రాజ్యసభ సభ్యత్వం స్వీకరించే సమయంలోనే వారు పార్టీ సభ్యత్వం స్వీకరించే అవకాశం ఉంది.

Telugu Ap Cm, Jagan, Layerniranjan, Vijayasai, Ysrcp Angry-Politics

ఇది ఇలా ఉంటె ఆర్ కృష్ణయ్య ఎంపికపై పార్టీలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.మొదటి నుంచి పార్టీ కోసం కష్ట పడిన వారికి.2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కేటాయించకుండా రాజ్యసభ హామీ ఇచ్చిన వారికి, ఇప్పుడు జగన్ మొండిచేయి చూపించారని, అసలు పార్టీకి సంబంధం లేని తెలంగాణకు చెందిన వ్యక్తికి రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టారని గతంలోనూ పరిమళ్ నత్వాని విషయంలో జగన్ ఇదే విధంగా చేశారనే ధిక్కార స్వరాలు మొదలయ్యాయి .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube