సుమన్ ను ర్యాగింగ్ చేసిన సీనియర్స్ కాళ్ల బేరానికి ఎందుకు వచ్చారో తెలుసా?

తెలుగు సినిమా పరిశ్రమతో పాటు దక్షిణాదికి చెందిన పలు సినిమా పరిశ్రమలలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుమన్.ఎన్నో చక్కటి సినిమాల్లో నటించి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.

నిజానికి సుమన్ చిన్నప్పుడు చాలా పద్దతిగా పెరిగాడు.తన తల్లి కాలేజీ లెక్చరర్.

అందుకే అతడిని చాలా క్రమశిక్షణగా పెంచింది.తనను ఎక్కడికి ఒంటరిగా పంపించేది కాదు.

ఆమె అంటే సుమన్ కు కూడా అంతే భయం ఉండేది.బయటి పిల్లలతో కలిసి ఆడుకోవాలనే సరదా ఉన్నా.

Advertisement

అమ్మ కొడుతుందని బయటకు వెళ్లేవాడు కాదు.సుమన్ మద్రాసులో చదువుకున్నాడు.తొలుత చర్చ్ పాక్ కాన్వెంట్ లో జాయిన్ అయ్యాడు.5వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాడు.ఈయన అక్కడ చేరినప్పుడు జయలలిత టెన్త్ చదువుతుంది.

సుమన్ డాక్టర్ కావాలని తన తల్లి కోరిక.అతడికేమో పైలెట్ కావాలని ఆశ ఉండేది.

అయితే వీరిద్దరు అనుకున్న రంగంలోకి కాకుండా రంగులు ప్రపంచలోకి వెళ్లడం విశేషం.

చిన్నప్పటి నుంచి సుమన్ కు పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం ఉండేది.తన ఆసక్తిని గమనించిన తల్లి ఆయనను 6వ తరగతి నుంచి 9వ తరగతి దాకా బీసెంట్ థియోసాఫిక‌ల్ హైస్కూల్ లో చదివించింది.అక్క‌డ సుమ‌న్ పెయింటింగ్‌లో శిక్ష‌ణ పొందాడు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

అంతేకాద వ‌రుస‌గా నాలుగేళ్ల‌ పాటు క‌ళాక్షేత్ర వాళ్లు నిర్వ‌హించే వైల్డ్ లైఫ్ పెయింటింగ్ కాంపిటిష‌న్‌లో మొదటి బహుమతి పొందాడు.అక్క‌డే వీణ‌, గిటార్ వాయించడం నేర్చుకున్నాడు.

Advertisement

బీసెంట్ లో 9వ తరగతి అయ్యాక రామ‌కృష్ణా హైస్కూల్‌లో సుమన్ ఎస్ఎస్ఎల్‌సీ చదివాడు.అనంతరం ప‌చ్చ‌య‌ప్ప కాలేజీలో పీయూసీ, బీఏ కంప్లీట్ చేశాడు.

ప‌చ్చ‌య‌ప్ప కాలేజీ అంటే అప్ప‌ట్లో అల్ల‌రి స్టూడెంట్స్‌ కు పెట్టింది పేరు.ఆ కాలేజీలో సుమన్ అడుగు పెట్టిన‌ప్పుడు సీనియ‌ర్స్ ర్యాగింగ్ చేయాలనుకున్నారు.

కొంత మంది ఆయన చుట్టూ చేరారు.చొక్కా తీసేసి, ప్యాంట్‌ తో బొమ్మ‌లాగా నిలబడి నమస్తే చేయాలన్నారు.భ‌య‌ప‌డి, ష‌ర్ట్ తీసేసి స‌లాం కొట్టాడు.

ఆ తర్వాత 5 రోజులకు సుమన్ స్కూల్ మేట్స్ 40 మంది అదే కాలేజీలో చేరారు.వాళ్లంతా చాలా బలంగా ఉండేవారు.

వాళ్లతో తన ర్యాగింగ్ గురించి చెప్పాడు సుమన్.అందరు కలిసి సుమన్ ను ర్యాగింగ్ చేసిన సీనియర్స్ ను అల్లరి చేశారు.

దీంతో సీనియర్స్ సారీ చెప్పి వీరి గ్యాంగ్ లో చేరిపోయారు.

తాజా వార్తలు