నేడు పెద్ద ఎండి కన్ను మూసారు.ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే పేరు తో చెప్తారు లేక పని చేసిన కంపెనీ గురించో మరి కాదంటే కుటుంబం గురించో చెప్తారు.
కానీ ఈ రోజు తెలుగు రాష్ట్రాలకు ఏమాత్రం పరిచయం లేకపోయినా ఒక వ్యవస్థ లో వణుకు పుట్టించిన వార్త ఆ పెద్ద ఎండి మరణం. ఇంత ఆ వ్యక్తి ఎవరు అనే కదా మీ అనుమానం.
అయన పేరు గాని, ఫోటోలు కానీ బయట ఎవరికి పెద్దగా తెలియదు.అతడే అట్లూరి రామ్మోహన రావు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజు రామోజీ రావు వెన్నెముక విరిగిపోయింది.బాల్య స్నేహితుడు అయినా అట్లూరిని తన చివరి శ్వాస వరకు తనతోనే పెట్టుకున్నాడు రామోజీ.
రామోజీ రావు ఏం పని చేసిన పెద్ద సారూ సలహా లేకుండా చేయడు.పేరుకే రామోజీ ఛైర్మెన్ అయినప్పటికీ అట్లూరి ఏం చెప్తే అదే ఆయనకు మంచి గురి.
ఈనాడు సంస్థల నుంచి రామోజీ ఫిలిం సిటీ వరకు ప్రతి పనిలో అట్లూరి రామోజీ తోనే ఉన్నాడు.ఎన్నో సంక్షోభాలు, వెన్ను పోటీలు, రాజకీయాలు, కుటుంబ సమస్యలు ఇలా ప్రతి ఒక్కటి అట్లూరి నిర్ణయంతోనే ముందుకు నడిచాయి .రామోజీ రావు ఆర్థిక మహా సామ్రాజ్యంలో అట్లూరి ప్రయాణం చాల దీర్గమైనది.ఈనాడు సంస్థలో పని చేసే సిబ్బందికి అట్లూరి రామ్మోహనరావు గురించి బాగా తెలుస్తుంది.
అయన ఒక పని రాక్షసుడు.రామోజీ రావు ఎదుగుదలలో ఇరుసుగా మారి బండి పగ్గాలని చేబూని నడిపించాడు.
ఎంతో మంది ఎండి లు వచ్చారు పోయారు కానీ పెద్ద ఎండి మాత్రం చనిపోయే వరకు రామోజీతోనే ఉన్నాడు.రామోజీ రావు కష్టాలు, సుఖాలు, వైభోగాలు, సంక్షోభాలు అన్నిటికి ఆయనే ప్రధాన వారధి.అట్లూరి కష్టం లేకుండా రామోజీ గ్రూప్ అఫ్ సంస్థలు లేవు.రామోజీ కూడా లేడు అంటే పెద్ద అతిశయోక్తి కాదు.రామోజీ రావు తన ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వెళ్తుంటే ఎన్నో విమర్శలు, వెన్ను పోట్లు ఉన్న అన్నిటిని మౌనంగా చెరిపేస్తూ వచ్చిన అట్లూరి రామోజీ రావు కి ఒక అప్పాజీ.
అయన రాజు అయితే అట్లూరి ఒక ఆంతరంగిక మంత్రి.కృష్ణ జిల్లాలో పెద్ద పారుపూడి లో 1935 లో పుట్టిన అట్లూరి, రామోజీ రావు కి క్లాస్ మేట్.1975 ఈనాడు గ్రూప్ పెట్టగానే రామోజీ అట్లూరిని పిలిచి బాధ్యతలు ఇవ్వగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనతోనే ఉన్నాడు.అయితే వయసు పెరగడం తో ఆరోగ్య సమస్యలు తలెత్తి తన అన్ని హోదాల నుంచి తప్పుకున్నారు.చివరగా AIG ఆసుపత్రిలో అయన కన్నుమూశారు.