దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా దీపావళి సంబరాలు స్టార్ట్ అయ్యాయి.ఈ క్రమంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హరీస్ అధికారిక నివాసంలో శుక్రవారం దీపావళి సంబరాలు ఘనంగా నిర్వహించారు.
మట్టి ప్రమిదలతో కమల హరీస్ కార్యాలయం మొత్తాన్ని అలంకరించారు.ఈ వేడుకలలో అమెరికా దేశానికి చెందిన అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
బాణా సంచాలు కాల్చారు.మాతాబులో ఇంకా కాకర పోవొత్తులు.
వంటివి కాల్చి పానీ పూరి వంటి సాంప్రదాయ వంటకాలు చేసుకొని విందు ఆరగించారు.
ఈ వేడుకలలో దాదాపు 100 మందికి పైగా ఇండో అమెరికన్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమల హరీస్ మాట్లాడుతూ చీకటిపై వెలుగు ప్రభావం చూపించడానికి స్ఫూర్తిని పొందే పండుగ దీపావళి.సంస్కృతుల పరిధులకు అతీతమైన సార్వత్రిక భావన ఈ పండుగ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో యువ డ్యాన్సర్లు పాల్గొని బాలీవుడ్ పాటలకు నృత్యం వేశారు.అనంతరం కమలహారిస్ దంపతులు వేడుకకు వచ్చిన వారికి దీపావళి శుభాకాంక్షలు తెలిపి కాకరపువ్వోతులు పంచిపెట్టారు.