బన్నీ మూవీ వల్ల చిరు, వెంకీ, నాగ్ మల్టీస్టారర్ ఆగిపోయిందట.. ఏమైందంటే?

ప్రస్తుత కాలంలో ఒక హీరో లేదా ఒక డైరెక్టర్ తన సినీ కెరీర్ లో 100 సినిమాలకు దర్శకత్వం వహించడం అంత తేలికైన విషయం కాదు.ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్లు తమ సినీ కెరీర్ లో 30 సినిమాల కంటే ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించలేరనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

 Unknown Facts About Star Hero Allu Arjun First Movie Gangothri , Allu Arjun, Fi-TeluguStop.com

అయితే సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు మాత్రం సులభంగా 100 సినిమాలకు దర్శకత్వం వహించారు.

రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 100వ సినిమా గంగోత్రి అనే సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు తొలి సినిమాతోనే విజయాన్ని సొంతం చేసుకున్నారు.అయితే రాఘవేంద్ర రావు తన వందో సినిమాగా మొదట చిరంజీవితో పాటు నాగార్జున, వెంకటేష్ లతో కలిసి మల్టీస్టారర్ సినిమాను ప్లాన్ చేశారు.

ప్రముఖ రచయిత చిన్నికృష్ణతో ఈ సినిమాకు సంబంధించిన కథను తయారు చేయించారు.

త్రివేణి సంగమం అనే పేరును ఆ సినిమాకు ఫిక్స్ చేయడంతో పాటు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లను ఆ సినిమాలో నటింపజేయడానికి ఒప్పించారు.

ఆ తర్వాత రాఘవేంద్రరావు అదే విషయాన్ని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ తో చెప్పగా అశ్వనీదత్ 100వ సినిమాను హాయిగా చేసుకోవాలని ఎందుకొచ్చిన టెన్షన్ అని కామెంట్లు చేశారు.ఆ తర్వాత ఆ కథ బాధ్యతలను చిన్నికృష్ణకు అప్పగించగా చిన్నికృష్ణ గంగోత్రి కథ రాశారు.

Telugu Allu Arjun, Gangothri, Alluarjun-Movie

గంగోత్రి సినిమాలో హీరోయిన్ పాత్రకు అదితి అగర్వాల్ ఎంపికైంది.ఆ తర్వాత గంగోత్రి సినిమాలోని హీరో పాత్రకు అల్లు అర్జున్ బాగుంటుందని భావించి బన్నీని ఆ సినిమా కోసం ఎంపిక చేశారు.ఆ విధంగా చిరు, వెంకీ, నాగ్ మల్టీస్టారర్ ఆగిపోయి గంగోత్రి సినిమా తెరకెక్కింది.బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube