టీఆర్ఎస్ పై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి మండిపాటు

టీఆర్ఎస్ పై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.జేపీ నడ్డాకు సమాధి కట్టడాన్ని ప్రహాద్ జోషి తీవ్రంగా ఖండించారు.

కేసీఆర్ మనసులో ఏముందో మునుగోడు టీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పకనే చెప్పారని విమర్శించారు.ఈ నేపథ్యంలో జేపీ నడ్డాకు సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంటోందని ఆరోపించారు.బీఆర్ఎస్ కాదు.

తెలంగాణ రావు సమితిగా పేరు మార్చుకోవాలని ఎద్దేవా చేశారు.మునుగోడులో కేసీఆర్, మంత్రులు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు.

Advertisement

దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా తెలంగాణ మారిందని విమర్శలు గుప్పించారు.కేసీఆర్ ప్రజల కోసం కాకుండా కేవలం తన కుటుంబం కోసం మాత్రమే పని చేస్తున్నారన్నారు.

ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు