మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్‌

భారత్‌ లో కరోనా కేసులు భయంకరంగా పెరుగుతున్నాయి.పరిస్థితి చూస్తుంటే త్వరలోనే ప్రపంచంలోనే అగ్ర స్థానంలో నిల్చునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది.

గత రెండు మూడు వారాలుగా ఇండియాలోని సెలబ్రెటీలకు కరోనా నిర్థారణ అవుతున్న నేపథ్యంలో కమ్యూనిటీ వ్యాప్తి ప్రారంభం అయినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇటీవలే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా కరోనా బారిన పడ్డట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.

అమిత్‌ షాతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే.తాజాగా మరో కేంద్ర మంత్రి కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది.

కేంద్ర ఇందన శాఖ మంత్రివర్యులు ధర్మేంద్ర ప్రధాన్‌కు కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది.ప్రస్తుతం ఆయన వైధ్యుల సూచన మేరకు హర్యానాలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Advertisement

ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని అయినా కూడా అత్యున్నత వైధ్య సేవలను అందిస్తున్నట్లుగా ఆసుపత్రి వర్గాల వారు పేర్కొన్నారు.దేశంలో కరోనా కేసుల సంఖ్య రెండు మిలియన్‌లకు చేరువ అవుతోంది.

మృతుల సంఖ్య కూడా భయంకరంగా పెరుగుతూనే ఉంది.నేడు దేశ వ్యాప్తంగా దాదాపుగా 50 వేల కేసులు నమోదు అయినట్లుగా తాజా అప్‌డేట్స్‌ ద్వారా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు