తెలుగు రాష్ట్రాలలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీ లెక్కలు బయటపెట్టిన కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 2021-22 నాటికి 50,677 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ తెలిపారు.రాజ్యసభలో ఆమ్ ఆమాద్మీ పార్టీ ఎంపి సంజయ్ సింగ్‌ అడిగిన ప్రశుకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.మొత్తం పోస్టుల్లో ఇవి 16.64% అని వెల్లడించారు.2019-20లో 56,739మేర ఉన్న ఖాళీలు 2020-21 నాటికి 35,358కి తగ్గాయని, 2021-22 నాటికల్లా మళ్లీ 50,677కి పెరిగాయన్నారు.ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య 40,42,535 నుంచి 46,86,207కి పెరిగినట్లు వెల్లడించారు.

 Union Minister Dharmendra Pradhan Released The Vacancy Figures For Teacher Posts-TeluguStop.com

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక “నాడు నేడు” పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో అనేక మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది.వివిధ పథకాలతో పాఠశాలలకు పిల్లలను పంపించే తల్లిదండ్రులకు ప్రోత్సాహాలు కల్పిస్తున్నారు. దీంతో ఏపీలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉంది.ఇక తెలంగాణ విషయానికి వచ్చేసరికి 2021-22లో 18,588 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.దేశంలో ఉన్నత విద్యా సంస్థల్లో 3753 బ్యాక్ లాగ్  పోస్టులు ఖాళీగా ఉన్నాయని…వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య అడిగిన మరో ప్రశ్నకు.కేంద్ర వైద్య శాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ సమాధానం ఇవ్వడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube