తండ్రీకూతుళ్ల బంధం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.ఈ భూమి మీద నిర్మితమైన బంధాలలో తండ్రీకూతుళ్ల బంధం అనేది చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి.
నాన్న కూతురుని మరో అమ్మలాగ భావిస్తాడు.కూతురు నాన్నని స్నేహితుడిలాగా ఫీల్ అవుతుంది.
ఇక తన కన్నా కూతురి కోసం తండ్రి ఏం చేయడానికైనా సిద్ధపడతాడు.వారిని పెంచడం నుండి, స్కూల్ కి పంపడం… పెళ్లి చేయడం వరకు ప్రతి తండ్రి కలలు కంటూ ఉంటాడు.
ఇక ఆ అందమైన రోజున తండ్రి పడే సంతోషం అంతాఇంతా కాదు.
తాజాగా అలాంటి తండ్రీ కూతుళ్ల బంధానికి తార్కాణంలాగ నిలిచే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఆ వీడియోని గమనిస్తే ఫ్యామిలీ వెడ్డింగ్ ఫంక్షన్‌లో ఒక తండ్రి తన కూతురు ఆనందం కోసం ఆమెతో కలిసి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం చూడవచ్చు.కాగా తండ్రి కూతుళ్ళ డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
కాగా ఈ వైరల్ వీడియో పాకిస్థాన్‌లో జరిగిన వివాహ వేడుకకు సంబంధించినది.ఇందులో తండ్రీకూతుళ్లు డ్యాన్స్ ఫ్లోర్ మీద ఒకే రిథమ్ తో డ్యాన్స్ చేస్తున్నారు.

‘జెడ నాషా’ పాటపై ఇద్దరూ డ్యాన్స్ చేయడం ఇక్కడ గమనించవచ్చు.ఇక పెళ్లికి వచ్చిన అతిధులు తండ్రి కూతురు చేసిన అద్భుతమైన డ్యాన్స్ ను మనసారా ఆస్వాదించడం ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు.దాంతో నెటిజన్లను ఈ వీడియోను బాగా ఆకర్షిస్తోంది.తండ్రీకూతుళ్ల ఈ అందమైన నృత్య ప్రదర్శనను ఇన్‌స్టాగ్రామ్‌లో వాసిలా స్టూడియో అనే ఖాతాలో షేర్ చేయగా తాజాగా వెలుగు చూసింది.
ఇప్పటివరకు ఈ వీడియోని 7 వేల మంది లైక్ చేయగా, 86 వేలకు పైగా వీక్షించారు.నెటిజన్లు కామెంట్లు పెడుతూ….తండ్రీ కూతుళ్లిద్దరూ తమ డ్యాన్స్‌తో వేదికపై సునామీ సృష్టించారు అని వారిని ఆకాశానికెత్తేస్తున్నారు.







