పెళ్లిలో ఊహించని ఘటన.. అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంతో బెంబేలెత్తిన అతిథులు

పెళ్లి అంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది.వధూవరుల తరుపు బంధువులు, సన్నిహితులతో పెళ్లి మండపం కోలాహలంగా దర్శనమిస్తుంటుంది.

 Unexpected Event At The Wedding The Guests Were Shocked By The Sudden Accident-TeluguStop.com

బంధువులంతా ఒకరినొకరు పలకరించుకుంటూ, ఉత్సాహంగా పెళ్లి వేడుకలో పాల్గొంటుంటారు.అయితే పెళ్లి అన్నాక చాలా అవాంతరాలు ఎదురవుతాయి.

అయితే తాజాగా విశాఖలో జరిగిన ఓ ఘటన పెళ్లికి వచ్చిన అతిథులను కంగారు పెట్టించింది.పెళ్లి మండపం లో నుంచి ఒక్కొక్కరుగా అతిథులు అంతా బయటకు పరుగులు తీశారు.

అసలు ఏం జరిగిందో తెలియక పెళ్లింటి వారు కంగారు పడ్డారు.తీరా అసలు కారణం తెలుసుకుని అంతా అవాక్కయ్యారు.

తమకు ఎదురైన సమస్యను తెలుసుకుని ఖంగుతిన్నారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Telugu Tiles Broken, Latest, Visakhapatnam-Latest News - Telugu

విశాఖలోని చినముషిడివాడ ప్రాంతం అది.శుక్రవారం ఓ పెళ్లి మండపంలో వివాహ వేడుక కోసం భారీగా అతిథులు తరలి వచ్చారు.తర్వాతి రోజు పెళ్లి తంతు జరగనుంది.ఇంతలో ముందు రోజు రాత్రి వివాహ వేడుక కోసం వచ్చిన అతిథులు, బంధువుల కోసం విందు భోజనం ఏర్పాటు చేశారు.

చాలా మంది భోజనానికి కూర్చున్నారు.ఇంతలో వారి కాళ్ల క్రింద ఉన్న భూమి ఏదో అవుతుందని అందరికీ అనిపించింది.

కిందకు చూడగానే అంతా షాక్ అయ్యారు.ఫ్లోర్ పై అమర్చిన టైల్స్ ఒక్కొక్కటిగా పగిలిపోయాయి.

అతిథులు భోజనం చేస్తున్న ప్రాంతం బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది.దీంతో అతిథుల్లో కలవరం మొదలైంది.ఒక్కొక్కరుగా భయంతో కిందికి పరుగులు తీశారు.పెళ్లింటి వారు కూడా ఏమైందోనని వెళ్లి చూశారు.దీంతో వారికి సమస్య అర్ధం అయింది.విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి విచారణ చేపట్టారు.

సమస్య తెలుసుకుని విచారించారు.పెళ్లికి ఇబ్బంది కలగకుండా వివాహ వేదికను సమీపంలోని మరో పెళ్లి మండపానికి మార్చారు.

సమస్య ఎందుకు తలెత్తిందో అధికారులు ఆరా తీస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube