ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఆర్ధిక మాంద్యంనీలినీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే.అమెరికా తదితర దేశాల్లో దీని ప్రభావం స్పష్టం కనిపిస్తోంది.
వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు గాను దిగ్గజ సంస్థలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి.రానున్న కొద్దినెలల్లో ఆర్ధిక పరిస్ధితి మరింత దారుణంగా వుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ నేపథ్యంలో ప్రపంచానికే ఆర్దిక కేంద్రంగా వెలుగొందుతోన్న అమెరికా పరిస్దితి చూస్తే… అక్కడ నిరుద్యోగ రేటు మార్చిలో 3.5 శాతానికి పడిపోయింది.ఆ నెలలో 2,36,000కు పైగా కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి.అయితే రాజకీయంగా దేశాధ్యక్షుడు జో బైడెన్( Joe Biden )కు ఇది లాభదాయకం కాదని విశ్లేషకులు అంటున్నారు.

అధిక ద్రవ్యోల్బణం స్థాయిలు, కోవిడ్ అనంతర పరిణామాల మధ్య అమెరికన్లను తీవ్ర భయాందోళనకు గురయ్యారు.దీంతో బైడెన్ సమర్ధతపై విమర్శలు వెల్లువెత్తాయి.అంతేకాదు ఒక్కసారిగా ప్రజల్లో ఆయన పాపులారిటీ సైతం తగ్గిపోయింది.మరోవైపు రాబోయే రోజుల్లో అమెరికాలో నిరుద్యోగిత రేటు పెరగవచ్చని పలు నివేదికలు చెబుతున్నాయి.ఫెడరల్ రిజర్వ్( Federal Reserve ) ప్రకారం.నిరుద్యోగిత రేటు 4.5 శాతానికి చేరుతుందని అంచనా.వియత్నాం యుద్ధం, కొరియన్ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా తీవ్ర ఆర్దిక సంక్షోభాన్ని( Financial crisis ) ఎదుర్కొంది.
ప్రస్తుత పరిణామాలు కూడా ఆనాటి స్థితిని గుర్తుచేస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి.

4.6 శాతం నిరుద్యోగం రేటు లేబర్ మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని పాస్కల్ మైఖైలట్ అంచనా వేశారు.అయితే అమెరికా గత అధ్యక్షులు బరాక్ ఒబామారోనాల్డ్ రీగన్, బిల్ క్లింటన్, గెరాల్డ్ ఫోర్డ్, జిమ్మీ కార్టర్, బుష్ సీనియర్, జూనియర్‌ల కంటే బైడెన్ హయాంలో నిరుద్యోగిత రేటు మెరుగ్గానే వుంది.
దీర్ఘకాలంలో బలమైన వృద్ధికి కారణమయ్యే నియామకాలను పెంచడమే బైడెన్ లక్ష్యమని వైట్‌హౌస్ అధికారి ఒకరు చెప్పారు.అయితే న్యూయార్క్ ఫెడ్ ప్రచురించిన పరిశోధన ప్రకారం 2019 చివరి నుంచి జూన్ 2022 వరకు అధిక ద్రవ్యోల్బణంలో మూడింట ఒక వంతు వాటా ఫెడరల్ ఎయిడ్‌దే.