బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న నటి దీపికా పదుకొనే పెళ్లయినప్పటికీ ఏమాత్రం అవకాశాలు తగ్గకుండా వరుస సినిమా అవకాశాలను అందుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపిక గతంలో తాను తీసుకున్న నిర్ణయాల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
సాధారణంగా ప్రతి ఒక్కరికి పని ఒత్తిడి కారణంగా లేదా పై అధికారుల ఒత్తిడి కారణంగా ఎంతో ఆందోళనకు గురవుతూ మానసికంగా కృంగిపోతూ ఉంటారు.ఇలా మానసిక ఆందోళనకు ఎక్కువ అవ్వడం వల్ల కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఆలోచనలు కూడా ప్రతి ఒక్కరికి వస్తాయి.
ఈ క్రమంలోనే తాను కూడా గతంలో ఎంతో మానసిక ఆందోళనకు, ఒత్తిడికి గురయ్యానని అయితే ఆ మానసిక ఆందోళనకు సరైన కారణం తనకు తెలియలేదని దీపిక వెల్లడించారు.ఈ విధంగా మానసిక ఒత్తిడి కారణం వల్ల తాను ఎన్నో సార్లు ఆత్మహత్య చేసుకోవాలని కూడా భావించానని ఈ సందర్భంగా ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు.
అయితే తన తల్లిదండ్రులు బెంగళూరులో ఉంటారని అప్పుడప్పుడు తనని చూడటానికి ముంబై వచ్చేవాళ్ళు అంటూ ఈమె తెలిపారు.ఇలా ఓసారి తన తల్లిదండ్రులు రావడంతో తాను సంతోషంగా ఉన్నట్లు నటించాను కానీ అమ్మ దగ్గర బయటపడటంతో అమ్మ నన్ను ప్రశ్నిస్తూ ఏదైనా వృత్తిపరమైన సమస్యలు ఉన్నాయా? బాయ్ ఫ్రెండ్ వల్ల సమస్యలు ఉన్నాయా అంటూ పలు రకాల ప్రశ్నలు వేసింది.

ఈ విధంగా అమ్మ నన్ను ఎన్నో ప్రశ్నలు వేసిన నా దగ్గర సమాధానం మాత్రం శూన్యం.తన బాధకు తన ఒత్తిడికి సరైన కారణం తనకు తెలియదని అయితే ఆ సమయంలో అమ్మానాన్నలు చొరవతో తాను సరైన చికిత్స తీసుకొని ఈ డిప్రెషన్ నుంచి బయటపడ్డానని, ఆరోజు ఆ దేవుడే అమ్మను నా దగ్గరకు పంపించారేమో అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.