ఉక్రెయిన్ సంక్షోభం.. భారత్ మా వైపే వుంటుందని అనుకుంటున్నాం: అమెరికా

ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవాలని రష్యా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే పుతిన్‌ దూకుడుకు కళ్లెం వేయాలని అగ్రరాజ్యం అమెరికా సారథ్యంలోని నాటో దళాలు సైతం అదే స్థాయిలో వ్యూహాలు రచిస్తున్నాయి.

ఉక్రెయిన్ చుట్టూ ఇరు పక్షాల దళాలు మోహరించాయి.ఫిబ్రవరి 16న దాడి తప్పదంటూ అమెరికా హెచ్చరించినప్పటికీ.

అలాంటి పరిణామాలు చోటు చేసుకోలేదు.అయినప్పటికీ ముప్పు తప్పదని రష్యా ఏ క్షణంలోనైనా దాడి చేస్తుందని అమెరికా ఆరోపిస్తోంది.

వీటిని రష్యా ఖండిస్తూనే వుంది.తమకు ఆ ఆలోచన లేదని ఇప్పటికే సేనలను వెనక్కి రప్పిస్తున్నట్లు చెబుతోంది.

Advertisement

అయితే రష్యా- ఉక్రెయిన్ సంక్షోభం.భారత్‌ను ఇరుకునపెట్టేలా కనిపిస్తోంది.

ఈ వివాదంలో భారత్‌ ఏ పక్షం వైపూ వుండలేని పరిస్థితి.అమెరికా, రష్యా, ఉక్రెయిన్‌, యూరోపియన్ యూనియన్‌తో భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి.

కానీ ఆయా దేశాలు మాత్రం భారత్‌ మద్దతును ఆశిస్తున్నాయి.ఇప్పటికే అమెరికా బహిరంగంగానే భారత్‌ను మద్దతు కోరింది.

కానీ.అమెరికాతో కలిసి క్వాడ్‌లో, రష్యాతో కలిసి బ్రిక్స్‌, ఆర్‌ఐసీ వంటి కూటముల్లో భారత్‌ కీలక భాగస్వామి .ఇలాంటి పరిస్ధితుల్లో ఏ పక్షం తీసుకున్నా దౌత్యపరంగా భారత్‌కు ఇబ్బందే.అంతర్జాతీయ నిబంధలకు భారత్ కట్టుబడి వుంటుందని.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తే.న్యూఢిల్లీ ఖచ్చితంగా తన పక్షానే వుంటుందని అమెరికా ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Advertisement

అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ మాదిరిగా ఉక్రెయిన్ నుంచి విదేశీయులను తరలింపు ప్రయత్నాలను అమెరికా తోసిపుచ్చినట్లుగా కనిపిస్తోంది.కాకపోతే.

విదేశీయులు తక్షణం ఉక్రెయిన్‌ను విడిచిపెట్టాల్సిందేనని అమెరికా హెచ్చరిస్తుండటం విశేషం.ఫిబ్రవరి 11న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో రష్యా, ఉక్రెయిన్‌లపై చర్చ జరిగింది.

ఈ సందర్భంగా ఈ సంక్షోభానికి దౌత్యం, శాంతియుత మార్గాల ద్వారానే పరిష్కారం లభించగలదని అమెరికా అభిప్రాయపడింది.

మరోవైపు రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విద్యార్థులు, పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.పరిస్ధితులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్న భారత్ఇప్పటికే ఓ ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసింది.దీనికి అదనంగా ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా 24 గంటలు పనిచేసే హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తెచ్చింది.

ఉక్రెయిన్‌లోని వివిధ విద్యాసంస్థల్లో దాదాపు 18 వేల మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు.అయితే ఉద్రిక్తత నేపథ్యంలో ఉక్రెయిన్‌ను తక్షణం విడిచి రావాలని భారత ప్రభుత్వం ఆదేశించింది.

అయితే చాలినన్న విమానాలు లేకపోవడం, టికెట్ రేట్లు ఎక్కువగా వుండటంతో అక్కడి భారతీయులు భయాందోళనలకు గురవుతున్నారు.

" autoplay>

తాజా వార్తలు