మీరు డైరెక్టర్లుగా అనర్హులు: ముగ్గురు భారత సంతతి వ్యాపారవేత్తలపై యూకేలో నిషేధం

అమ్మకాలను పెంచేందుకు కాల్ సెంటర్ ఉపయోగించిన తప్పుడు మార్గాలకు అడ్డుకట్ట వేయడంలో విఫలమయ్యారన్న అభియోగంపై ముగ్గురు భారత సంతతీ కంపెనీ డైరెక్టర్లపై యూకే ప్రభుత్వం 21 సంవత్సరాల నిషేధం విధించింది.

రమాకాంత్ లాల్, మెల్విన్ అలియాస్ డిసిల్వా, సోరియానో డిసౌజా ఒక్కొక్కరు 7 సంవత్సరాల అనర్హత ఒప్పందంపై సంతకం చేసినట్లు ఇన్‌సాల్వెన్సీ సర్వీస్ గురువారం తెలిపింది.

తద్వారా వీరు కోర్టు అనుమతి లేకుండా సంస్థ ప్రమోషన్, ఏర్పాటు, నిర్వహణ వంటి వ్యవహారాల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా జోక్యం చేసుకోరాదు.అలాగే డైరెక్టర్లుగా వ్యవహరించరాదు.

డిసిల్వా (44) పశ్చిమ లండన్‌లోని హౌన్స్‌లోకు చెందినవారు కాగా, డిసౌజా (35), రమాకాంత్ లాల్ (37) ముంబైకి చెందిన వారని సర్వీస్ తెలిపింది.వీరు ముగ్గురు వివిడ్ లైఫ్ స్టైల్ లిమిటెడ్‌కు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు.2013లో ఆరోగ్య పదార్థాల వర్తకం, సేవలకు సంబంధించి ఈ సంస్థపై ఫిర్యాదులు రావడంతో 2018 ఆగస్టులో దర్యాప్తు ప్రారంభించారు.ఈ ముగ్గురే సంస్థకు శాశ్వత డైరెక్టర్లుగా ఉండటంతో పాటు సేల్స్ ఏజెంట్లకు సరైన మార్గనిర్దేశం చేయడంలో విఫలమైనట్లు దర్యాప్తు అధికారులు తేల్చారు.

ఆరోగ్యానికి సంబంధించిన సేవలను, పదార్ధాలను విక్రయించడానికి ఈ కంపెనీ ఒక విదేశీ కాల్ సెంటర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.దానికి సరైన పర్యవేక్షణ లేకపోవడంతో అమ్మకాల కోసం సేల్స్ ఏజెంట్లు ప్రజలను తీవ్ర ఒత్తిడికి గురిచేశారు.

Advertisement

ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులను వినియోగదారులు కొనుగోలు చేసేలా వారిని తప్పుదోవ పట్టించారు.

సేల్స్ ఏజెంట్లు వైద్య పరంగా శిక్షణ పొందారని, వైద్యపరమైన అర్హతలు ఉన్నాయని అలాగే నేషనల్ హెల్త్ సర్వీస్‌లో పనిచేశారంటూ వినియోగదారులను మోసం చేశారు.కాల్ సెంటర్ సిబ్బంది సైతం తాము ప్రభుత్వరంగ సంస్థ నుంచి మాట్లాడుతున్నట్లుగా వినియోగదారులతో మాట్లాడేవారని దర్యాప్తులో తేలింది.కస్టమర్ క్రెడిట్ కార్డ్ మరియు బ్యాంక్ వివరాలు వారి ఉద్దేశించిన ప్రయోజనం కోసం ఉపయోగించబడుతున్నాయని నిర్ధారించడంలోనూ డైరెక్టర్లు విఫలమయ్యారని తేలింది.మోసపూరిత మార్గాల ద్వారా సుమారు 11,000 మంది వినియోగదారుల నుంచి 1.9 మిలియన్ పౌండ్లను వీరు సంపాదించారని ఇన్సాల్వెన్సి సర్వీస్ అంచనా.డైరెక్టర్లుగా వారి ప్రవర్తన ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదని, ఒప్పందం చేసుకున్న కాల్ సెంటర్‌ కార్యకాలపాలపై పర్యవేక్షణ కొరవడిందని ఇన్‌సాల్వెన్సీకి చెందిన మార్టిన్ గిట్నర్ అభిప్రాయపడ్డారు.

వివిడ్ లైఫ్‌స్టైల్‌ను లిక్విడేట్ చేసేందుకు తాము కోర్టు అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లు ఆయన చెప్పారు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు