ఆర్ఆర్ఆర్ తెలుగు వెర్షన్ లో లేని ఆ సీన్లు హిందీలో ఉన్నాయా.. అసలేం జరిగిందంటే?

ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్లలో విడుదల కావడానికి మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది.25వ తేదీ ఉదయం 4 గంటల నుంచే దేశంలోని పలు థియేటర్లలో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రదర్శితం కానుంది.చరణ్, తారక్ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ సినిమాతో దక్కుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.మూడు గంటల రెండు నిమిషాల నిడివితో ఆర్ఆర్ఆర్ తెలుగు వెర్షన్ రిలీజ్ కానుంది.

 Two Different Run Times For Telugu And Hindi Versions Of Rrr Movie Details Here-TeluguStop.com

అయితే ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ నిడివి తెలుగు వెర్షన్ కంటే ఎక్కువ కావడం గమనార్హం.

మూడు గంటల 7 నిమిషాల నిడివితో ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ రిలీజ్ కానుంది.

వైరల్ అవుతున్న ఈ వార్త వల్ల ఆర్ఆర్ఆర్ తెలుగు వెర్షన్ లో లేని సన్నివేశాలు హిందీ వెర్షన్ లో ఉండవచ్చని చరణ్, తారక్ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.చిత్రయూనిట్ నుంచి ఎవరో ఒకరు క్లారిటీ ఇచ్చి ఈ సందేహాలకు చెక్ పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

తెలుగు వెర్షన్ లో లేని సీన్లు హిందీలో ఉంటే మాత్రం ఫ్యాన్స్ ఫీలయ్యే ఛాన్స్ ఉంది.

Telugu Ajay Devgan, Alia Bhatt, Hindi, Raja Mouli, Ram Chran, Rrr, Telugu, Tolly

తెలుగు రాష్ట్రాల వరకు ఈ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందనడంలో సందేహం లేదు.అయితే ఆర్ఆర్ఆర్ భారీ బడ్జెట్ సినిమా కావడంతో హిందీ వెర్షన్ కలెక్షన్లు కూడా ఈ సినిమాకు కీలకం కానుంది.కట్టప్ప ఫ్యాక్టర్ బాహుబలి2 హిందీలో రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడానికి కారణం కాగా ఆర్ఆర్ఆర్ రిలీజైన తర్వాత హిందీలో భారీగా కలెక్షన్లు వస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Telugu Ajay Devgan, Alia Bhatt, Hindi, Raja Mouli, Ram Chran, Rrr, Telugu, Tolly

ఆర్ఆర్ఆర్ మూవీలో మొదట చరణ్ ఎంట్రీ ఉంటుందని ఆ తర్వాత తారక్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది.ఈ సినిమా ద్వారా చరణ్, ఎన్టీఆర్, జక్కన్నలకు ప్రేక్షకుల అంచనాలకు అందని స్థాయిలో రెమ్యునరేషన్ దక్కిందని ప్రచారం జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube