టమాటాలకు ఇద్దరు 'బౌన్సర్ల' సెక్యూరిటీ.. కనీసం ముట్టుకున్నా ఊరుకోరు!

దేశంలో ఇప్పుడు టమాటా( TOMATO ) ఖరీదైన వస్తువుల జాబితాలోకి చేరింది! ఎక్కడ చూసినా కొండెక్కిన దీని ధర గురించే చర్చే.కొన్ని ప్రాంతాల్లో టమాటా ధర డబుల్​ సెంచరీని కూడా దాటింది.

 Two 'bouncers' Security For Tomatoes. Bouncers' , Tomato , Ajay , Uttar Prade-TeluguStop.com

ఇటీవలే కర్ణాటకలోని టమాటాల దుకాణంలో సీసీ కెమెరా పెట్టుకుని వ్యాపారం చేస్తున్న వ్యక్తి వార్తల్లో నిలిచాడు.ఇప్పుడు ఉత్తర్​ప్రదేశ్​కు( Uttar Pradesh ) చెందిన మరో వ్యాపారి ఇంకొక అడుగు ముందుకేశాడు.

తన కూరగాయల దుకాణానికి ఇద్దరు బౌన్సర్లను సెక్యూరిటీగా పెట్టుకున్నాడు.టమాటాలను కొనుగోలు చేసేందుకు వచ్చిన కొందరు ప్రజలు టమాటాలను దొంగలిస్తున్నారని.

అందుకే బాడీగార్డులను పెట్టుకున్నానని వ్యాపారి అజయ్​ ఫౌజీ చెబుతున్నాడు.

ఇప్పుడు ఉన్న అన్ని కూరగాయల్లో టమాటా ధర బాగా పెరిగిపోయిందని.

ప్రజలు రేటు తగ్గించమని అడుగుతున్నారని అజయ్​ అన్నాడు.కానీ నాకు వచ్చే లాభం బట్టే అమ్ముతున్నానని తెలిపాడు.

టమాటాలను కొనేందుకు వచ్చిన వారు.కొందరు ధర తగ్గించమని గొడవపడుతున్నారు.

మరికొందరు టమాటాలను దొంగలిస్తున్నారు.అందుకే బౌన్సర్‌లను పెట్టుకున్నాను.ప్రస్తుతం కిలో టమాటా రూ.160కు అమ్ముతున్నాను.ప్రజలు కేవలం 50 లేదా 100 గ్రాముల టమాటాలే కొంటున్నారు.”అజయ్​ ఫౌజీ( Ajay ), టమాటాల వ్యాపారిఖరీదు అని చెప్పు ముట్టుకోనివ్వడం లేదు.”టమాటాలు చాలా ఖరీదు అని చెప్పి ముట్టుకోనివ్వడం లేదు.250 గ్రాముల టమాటాలను రూ.35 పెట్టి కొన్నాను.కుటుంబంలో 10 మంది ఉన్నప్పుడు తక్కువ టమాటాలతో ఏం చేయగలం? కానీ తప్పదు” అంటూ కొనుగోలుదారుడు విజయ్ కుమార్ యాదవ్ వాపోయాడు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube