సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు ప్రేమించుకుని పెళ్లిళ్లు చేసుకోవడం పిల్లల పుట్టిన తరువాత అయినా మనస్పర్ధలు వస్తే విడిపోవడానికి కూడా ఏమాత్రం వెనకాడరు.ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు తీసుకొని విడిపోయారు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అమీర్ ఖాన్ ( Aamir Khan ) సైతం ఇప్పటికే రెండు వివాహాలు చేసుకుని తన ఇద్దరి భార్యలకు విడాకులు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.తాజాగా అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ ( Ira Khan ) తన తల్లిదండ్రుల విడాకుల గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అమీర్ ఖాన్ మొదటగా రీనా దత్తా( Reena Dattha ) అనే మహిళను వివాహం చేసుకున్నారు.వీరికి ఐరా ఖాన్ జన్మించారు.ఇక ఎంతో సంతోషంగా ఉన్నటువంటి వీరి జీవితంలో మనస్పర్ధలు రావడంతో వీరిద్దరూ స్నేహపూర్వకంగా విడిపోవాలని నిర్ణయించుకొని విడాకులకు సిద్ధమయ్యారు.ఇలా తల్లిదండ్రుల విడాకుల గురించి తాజాగా ఐరా ఖాన్ మాట్లాడుతూ అమ్మ నాన్న స్నేహపూర్వకంగా విడాకులు( Divorce ) తీసుకున్నారని తెలిసినప్పటికీ తాను చాలా డిప్రెషన్ కి గురయ్యానని తెలియజేశారు.

అమ్మ నాన్న విడాకులు తీసుకునే సమయంలో తాను ఇండియాలో లేను విదేశాలలో ఉన్నాను.ఇక ఈ విషయం తెలిసి తాను వెంటనే ఇండియాకి వచ్చానని తెలిపారు.అయితే వారిద్దరు స్నేహపూర్వకంగా విడాకులు తీసుకున్నారని చెప్పినప్పటికీ తన మనసుకు చాలా బాధ కలిగిందని తెలిపారు.ఇలా అమ్మానాన్న విడాకులు తీసుకొని విడిపోతున్నారని తెలిసి నాలుగు రోజులపాటు భోజనం చేయకుండా బాధపడుతూ కూర్చున్నానని అలాగే రోజులో ఎనిమిది గంటలపాటు ఏడవడం 10 గంటల పాటు నిద్రపోవడమే నా పనిగా ఉందని తెలిపారు.
అయితే ఈ బాధను ఎవరికి చెప్పుకోలేదు ఈ విషయాన్ని తాను బయట పెడితే వారందరూ కూడా బాధపడతారని ఒక్కదానిని ఆ బాధ అనుభవించాను అంటూ ఈ సందర్భంగా ఐరా ఖాన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అవుతున్నాయి.







