మన దేశంలో చాలామంది యువతీయువకులు తమ లక్ష్యాలను సాధించడానికి రేయింబవళ్లు కష్టపడుతున్నారు.ఐఏఎస్ కావడం సులువు కాదనే సంగతి తెలిసిందే.
ఎంతో కష్టపడితే మాత్రమే ఐఏఎస్ కావాలనే కలను నెరవేర్చుకోవడం సాధ్యమవుతుంది.అయితే ఒక యువకుడు మాత్రం మొదట డాక్టర్ అయ్యి ఆ తర్వాత కలెక్టర్ అయ్యి 30 సంవత్సరాల వయస్సులో 2600 కోట్ల రూపాయల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు.అన్ అకాడమీ( Un academy ) ఫౌండర్లలో ఒకరైన రోమన్ సై( Roman saini )నీ సక్సెస్ స్టోరీ వింటే మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.16 సంవత్సరాల వయస్సులోనే రోమన్ సైనీ ఎయిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణుడు కావడంతో పాటు డాక్టర్ గా పట్టా అందుకున్నాడు.ఆ తర్వాత 22 సంవత్సరాల వయస్సులో యూపీఎస్సీ పరీక్షలు రాసి ఐఏఎస్ గా పని చేశాడు.మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని నెలల పాటు రోమన్ సైనీ కలెక్టర్ గా కూడా పని చేశారు.

డాక్టర్ గా పని చేసినా, కలెక్టర్ గా పని చేసినా ఆ ఉద్యోగాలు మంచి సంతృప్తిని ఇవ్వకపోవడంరో రోమన్ సైనీ తన స్నేహితులైన గౌరవ్ ముంజాల్, హిమేశ్ సింగ్ లతో కలిసి అన్ అకాడమీ అనే ఛానల్ పెట్టి యువతకు ఉచితంగా సివిల్ సర్వీసె( Civil Service )స్ కు సంబంధించిన పాఠాలు చెప్పారు.ఈ యూట్యూబ్ ఛానల్ కు ఊహించని స్థాయిలో స్పందన రావడంతో అన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అన్ అకాడమీ కంపెనీగా మారింది.

ఆన్ లైన్ లో ట్రైనింగ్ ఇస్తూ ఈ కంపెనీ తక్కువ సమయంలోనే ఏకంగా 2600 కోట్ల రూపాయల సంస్థగా ఎదగడం గమనార్హం.రోమన్ సైనీ సక్సెస్ స్టోరీ ఒకింత షాకింగ్ గా అనిపించినా ఇతని సక్సెస్ స్టోరీ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పవచ్చు.తన సక్సెస్ తో రోమన్ సైనీ ఎంతోమందికి ఆదర్శంగా నిలవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.







