వైరల్: లైవ్‌లో వంట చేసి మార్కులు కొట్టేద్దామనుకుంది, చివరకు అభాసుపాలైంది!

వంట చేయడం అనేది ఒక ఆర్ట్.అందుకే భారతీయ శాస్త్రాలు 64 కళలలో వంటని చేర్చడం జరిగింది.

 Twitch Streamer Almost Burnt Down Her Kitchen In A Cooking Stream,cooking Lvie S-TeluguStop.com

వంట అందరూ చేస్తారు.కానీ టేస్ట్ లో మాత్రం చాలా తేడాలను మనం గమనించవచ్చు.

దీనికి కారణం ఇంగ్రిడియన్స్ అని అందరూ అనుకుంటారు.కానీ అది కానేకాదు.

అవును.చేతివాటం అనేది ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

దాన్ని మనవాళ్ళు చేసిసారం అనికూడా అంటారు.కొందరు అన్నిరకాల ఇంగ్రిడియన్స్ వాడినా పెద్ద టేస్ట్ ఉండదు.

కొంతమంది అందుబాటులో వున్న అతికొద్ది ఇంగ్రిడియన్స్ తోనే అద్భుతమైన రుచితో వంటకాలు చేసి అతిథుల్ని సంతృప్తి పరుస్తారు.దీనికి కారణం చేయి సారమే.

అందుకే వంట చేయడం అనేది అంత సులువుకాని విషయం.ఇకపోతే నేటితరం యువత యూట్యూబ్ లో వంటల వీడియోలు చూసి తమకు రాని వంటలు చాలా ఈజీగా చేసున్నారు.

సోషల్ మీడియా స్థాయి పెరిగిన తరువాత వంటకి సంబంధించినటువంటి వీడియోలు క్రేజీగా మారాయి.ఈ క్రమంలో ప్రపంచంలో అత్యధికంగా వ్యూస్ వీటికే వస్తున్నాయి.దాంతో చాలామంది గృహిణులు ఇలాంటి వీడియోలు చేసి బాగానే సంపాదిస్తున్నారు.ఈ క్రమంలోనే ఓ విదేశీ వంటలక్క చేసిన ప్రయోగం బెడిసికొట్టింది.

దాదాపు ఆమె కిచెన్ కాలిపోయేంత పరిస్థితి వచ్చింది.

కెల్లీ కారన్ అనే ఓ విదేశీ మహిళ పొగలు కక్కేలా వంట చేస్తూ లైవ్ స్ట్రీమింగ్ పెట్టింది.స్టవ్ మీద నాన్వెజ్ వండుతూ ఎలా చేయాలో తన ఫాలోవర్లకు వివరిస్తోంది.ఇంతలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

సడెన్ గా నల్లటి పొగలతో కూడిన సెగలు రేగాయి.తరువాత అగ్గి రాజుకుంది.

కళాయిని తీసి సింకులో వేసే సరికి మరింతగా మంట రేగింది.భయంతో ఆ యూట్యూబర్ కంగారు పడుతూ కళాయిని తీసి మళ్లీ స్టవ్ మీద పెట్టింది.

అయినా మంటలు తగ్గుముఖం పట్టలేదు.చివరికి ఏం జరిగిందో తెలియదు కానీ వీడియో మాత్రం అప్పటితో ఆగిపోయింది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube