భానుప్రియ పనిమనిషిపై లైంగిక వేధింపుల కేసు క్లోజ్.! చివరికి ఏమైందంటే.? కొత్తమలుపు తిరిగిన వివాదం!

ప్రముఖసినీ నటి భానుప్రియ పైన బాలిక లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదైన విషయం అందరికి తెలిసిందే.

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పండ్రవాడకు చెందిన ప్రభావతి అనే మహిళ ఏడాది కిందట తన కూతురు సంధ్యని చెన్నైలో భానుప్రియ నివాసంలో పనికి పెట్టింది.

ఏడాది కాలంగా కనీసం మాట్లాడనీయటం లేదని తల్లి ప్రభావతి ఆరోపించింది.చైల్డ్ హెల్ప్ లైన్ వారికి ఈ విషయం తెలియడంతో రంగంలోకి దిగారు.

వారి సాయంతో ప్రభావతి సామర్లకోట పోలీస్ స్టేషన్ లో భానుప్రియపై కేసు నమోదు చేసింది.భానుప్రియ సోదరుడు తన కుమర్తె పట్ల నీచంగా ప్రవర్తిస్తున్నాడని సంచలన విషయాన్ని బయట పెట్టింది.

అతడు తరచుగా తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.తన కుమార్తెని ఇంటికి పంపండి అని ప్రాధేయపడినా అంగీకరించడం లేదు.

Advertisement

తర్వాత ఈ విషయంపై భానుప్రియ గారు ఆరోపణలు అవాస్తవమని, తమ ఇంట్లో పనిచేయడానికి వచ్చిన ఆ బాలిక దొంగతనానికి పాల్పడిన మాట వాస్తవమని భానుప్రియ స్పందించారు.తమ ఇంట్లో నుంచి దాదాపు లక్షా 50వేల డబ్బును, బంగారాన్ని, కెమెరాను, ఐప్యాడ్‌ను దొంగిలించిందని ఆమె ఆరోపించారు.

తొలుత నిజం చెప్పలేదని, నిలదీసి అడిగితే నిజం చెప్పిందని తెలిపారు.

కాగా శనివారం నటి భానుప్రియ చెన్నైలో ఒక మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఇంటి పనికి తీసుకొచ్చిన 16 ఏళ్ల యువతి ఇంట్లో దొంగతనానికి పాల్ప డిందని, తాము అడగడంతో దొంగిలించిన కొన్ని వస్తువులను తిరిగి ఇచ్చిందని, ఇంకా విలువైన వస్తువులు ఇవ్వలేదని చెప్పారు.తానే ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెబితే వద్దని పనిమనిషి తల్లి ప్రభావతి ఏడ్చిందని తెలిపారు.శుక్రవారం పోలీసులు, పిల్లల సంరక్షణ విభాగం వారు పనిపిల్లను తీసుకెళ్లారని నటి భానుప్రియ తెలిపారు.

అయితే మైనర్ బాలికను పనిలో పెట్టుకోవడం మరో వివాదానికి కేంద్ర బిందువుగా మారుతున్నది.చిన్న పిల్లలను పనిలో పెట్టుకోవడం బాల కార్మికుల చట్టాన్ని ఉల్లంఘించడమనే విషయాన్ని పట్టించుకోలేదన వాదన వినిపిస్తున్నది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఈ వివాదం మరో కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు