నా పేరు మీనాక్షి, కళ్యాణం కమనీయం( Kalyanam Kamaniyam , Na peru Meenakshi ) సీరియల్స్ ద్వారా పాపులారిటీని సంపాదించిన మధుసూదన్ ( Madhusudan )ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కెరీర్ విషయంలో నేను హ్యాపీ అని ఆయన తెలిపారు.
ప్రేక్షకులు చేస్తున్న సపోర్ట్ వల్లే ఇన్నేళ్లు నటుడిగా కెరీర్ ను కొనసాగించడం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.నాకు ఇంటర్ చదివే కూతురు ఉందని చిన్న వయస్సులోనే నా పెళ్లి జరిగిందని మధుసూదన్ తెలిపారు.
నా మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అని మధుసూదన్ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఒక సీరియల్ లో మాత్రమే నటిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు.
నా డ్రెస్సింగ్ విషయంలో డాటర్ ఛాయిస్ ఎక్కువని మధుసూదన్ తెలిపారు.మా పేరెంట్స్ చనిపోయారని బెంగళూరులో( Bangalore ) ఎవరూ లేరని మధుసూదన్ అన్నారు.

నాకు ఒక కొడుకు ఉన్నాడని నా కుటుంబమే నా ప్రపంచం అని మధుసూదన్ కామెంట్లు చేశారు.నాకు షార్ట్ టెంపర్ ఎక్కువని ఆయన తెలిపారు.నా లైఫ్ బోరింగ్ అని కొత్తగా ఏమీ జరగదని ఇక్కడ కొత్తగా జరగడానికి ఏమీ ఉండదని ఆయన చెప్పుకొచ్చారు.నా గురించి నేను డబ్బా కొట్టుకోవడం కరెక్ట్ కాదని మధుసూదన్ తెలిపారు.
నటి శ్రీదేవి నా ఫస్ట్ క్రష్ అని మధుసూదన్ వెల్లడించారు.సోషల్ మీడియాలో నేను యాక్టివ్ గా ఉండనని ఆయన చెప్పుకొచ్చారు.
నా గురించి గాసిప్స్ అయితే రాలేదని మధుసూదన్ అన్నారు.నా ఫ్యామిలీతో నాకు ఎంతో అటాచ్ మెంట్ ఉందని ఆయన కామెంట్లు చేశారు.
మధుసూదన్ కెరీర్ పరంగా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.మధుసూదన్ పలు సీరియళ్లలో కూడా నటించడం గమనార్హం.
కెరీర్ పరంగా ఎంత ఎదిగినా మధుసూదన్ మాత్రం సింపుల్ గా ఉండటానికి ఇష్టపడుతున్నారు.







