వావ్.. గాలిలో ఎగురుతూ ఉల్లిపాయలు కట్ చేసిన 'స్మైలీ చెఫ్'..!

ఆడవాళ్లకు వంట ఇంటికి అవినాభావ సంభంధం ఉంటుంది.

అయితే ఈ మధ్య మగవారు కూడా మేము ఏం తక్కువ కాము అని వంటల్లో ఆడవాళ్లకు పోటీ ఇస్తున్నారు.

మగవాళ్ళతో ఫేమస్ చెఫ్స్ చాలా మందే ఉన్నారు.టర్కీ కి చెందిన ఫేమస్ చెఫ్ గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది.

తరచు సోషల్ మీడియా చూసే వారికీ ఇతని గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఎందుకంటే సోషల్ మీడియాలో గడిపే వారికీ ఇతడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక వీడియోలో చూసే ఉంటారు.

ఈ ఫేమస్ చెఫ్ పేరు బురాక్ ఓజెడిమిర్.అందరు ఇతన్ని స్మైలీ చెఫ్ అని ముద్దుగా పిలుస్తారు.ఎందుకంటే ఇతడు అన్ని వీడియోల్లో వంటలను నవ్వుతూనే చేస్తాడు.

Advertisement

అస్సలు స్మైల్ మిస్ అవ్వడు.వంట వైపు చూడకుండా కేవలం కెమెరా వైపు మాత్రమే చూస్తూ నవ్వుతూనే వంటను పూర్తి చేస్తాడు.

తాజాగా ఇతడు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఏం చేసాడంటే ఇతడు హెలికాఫ్టర్ లో కూర్చుని ఉల్లిపాయలు కట్ చేసాడు.

మనం మాములుగా ఇంట్లో వంటగదిలో ఉల్లిపాయలు కట్ చేయడానికి నానా కష్టాలు పడతాము.కానీ ఇతడు కదులుతున్న హెలికాఫ్టర్ లో వెళుతూ ఉల్లిపాయలను చకచకా కట్ చేసాడు.

అంత ఎత్తులో గాలిలో కదులుతున్న హెలికాఫ్టర్ లో ఉల్లిపాయలను కట్ చేయడం అంటే మాటలా.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
జీవితం మహా చెడ్డది భయ్యా.. భార్య వల్ల చెత్త ఏరుకునే స్థాయికి ఇంజనీర్‌..?

కానీ ఈ చెఫ్ మాత్రం అవలీలగా కట్ చేసి అవతల పడేసాడు.ఎప్పుడు వంట ఎలా చూడకుండా చేస్తాడో అలానే ఉల్లిపాయలను కూడా చూడకుండానే కదులుతున్న హెలికాఫ్టర్ లో కూర్చుని టకాటకా కట్ చేసాడు.ఈ వీడియో అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఎగిరే ఉల్లిపాయలంటే మీకు ఇష్టమేనా అని ఆ వీడియోను పోస్ట్ చేసాడు.

Advertisement

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.మీరు కూడా చూసేయండి.

తాజా వార్తలు