ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింతలు, విశేషాలు, రహస్యాలు ఉంటాయి.మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి.
అప్పుడప్పుడు పురావస్తు తవ్వకాల్లో బయటపడే శిలాశాసనాల ద్వారా ఎన్నో కొత్త విషయాలు బయటపడుతూ ఉంటాయి.ఇవి మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.
రహస్యాలను తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు ఎన్నో ప్రయత్నాలు చేస్తోన్నారు.

ఒక్కొక్కసారి తవ్వకాల్లో పురాతన కాలం నాటి వస్తువులు వెలుగులోకి వస్తూ ఉంటాయి.ఏళ్ల కాలం నాటి వస్తువులు కూడా బయటపడుతూ ఉంటాయి.వీటిని పరిశీలించినప్పుడు పురాతన కాలంలో రాజులు ఎలా జీవించారో, అప్పటి ప్రజలు ఎలా ఉండేవారో అర్థమవుతుంది.
మన పూర్వీకుల జాడను తెలిపే చారిత్రాత్మక ప్రదేశాలు( Historical Places ) చాలా ఉన్నాయి.ఇవి అప్పటి జీవితం ఎలా ఉందనేది చెప్పడానికి ప్రతిబింబాలుగా నిలుస్తాయి.అలాంటి ఒక ప్రదేశం ఇప్పుడు టర్కీలో( Turkey ) బయటపడింది.తాజాగా ఒక చారిత్రాత్మక నగరంలో టర్కీలో బయటపడింది.
ఈ నగరం 2 వేల సంవత్సరాల నాటిగా చెబుతున్నారు.

అయితే ఈ చారిత్రాక నగరం ఒక ఇంట్లో దాగి ఉంది.దీంతో ఆ ఇంటి యాజమాని అవాక్కవుతున్నాడు.ఇంత పెద్ద చారిత్రక నగరం తన ఇంట్లో ఉండదని తనకు ఇప్పటివరకు తెలియలేదని చెబుతున్నాడు.
అతడు ఇంట్లో కోళ్లు పెంచుకుంటున్నాడు.ఇంటి నేలమాళిగలోకి కోళ్లు వెళ్లడాన్ని గమనించాడు.
దీంతో వాటిని ఫాలో అవ్వగా అతడి ఇంట్లో పురాతన కాలం నాటి నగరం బయటపడింది.అతడి ఇంట్లోని గోడకు రంధ్రం పడింది.
దీంతో ఆ గోడను బద్దలు కొట్టాడు.దీంతో పెద్ద సొరంగం కనిపించింది.ఆ సొరంగంలోకి వెళ్ల చూడగా పెద్ద నగరం బయటపడింది.280 అడుగుల దిగువున ఉన్న ఈ చారిత్రక నగరం చూసి అందరూ షాక్ అవుతున్నారు.370 బీసీ నాటి చారిత్రక పత్రాల లభ్యమయ్యాయి.







