అమెరికా అధ్యక్ష ఎన్నికలు .. కెన్నెడీ నుంచి రన్నింగ్ మేట్‌ ప్రతిపాదన , తిరస్కరించిన తులసి గబ్బార్డ్

2022లో డెమొక్రాటిక్ పార్టీని విడిచిపెట్టిన మాజీ హవాయి ప్రతినిధి తులసి గబ్బార్డ్( Tulsi Gabbard ) సంచలన వ్యాఖ్యలు చేశారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగిన రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్( Robert F Kennedy Jr ) తన రన్నింగ్ మేట్‌గా వుండాలని కోరారని, కానీ తాను తిరస్కరించినట్లు ఆమె ఏబీసీ న్యూస్‌తో చెప్పారు.

2022లో కెన్నెడీని చాలా సార్లు కలిశానని.తాము మంచి స్నేహితులయ్యామని తులసి గబ్బార్డ్ వెల్లడించారు.

అతని ప్రతిపాదనను తాను హుందాగా తిరస్కరించానని ఆమె చెప్పారు.అయితే ఈ ఆఫర్‌ను తిరస్కరించడానికి గల కారణాలను తులసి గబ్బార్డ్ వివరించలేదు.

కెన్నెడీ, అతని ప్రచార బృందం తులసి వ్యాఖ్యలపై స్పందించలేదు.మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) మిత్రులు కూడా తులసి గబ్బార్డ్‌ను వైస్ ప్రెసిడెంట్‌ పదవికి సరైన వ్యక్తిగా సూచించారు.

Advertisement

రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ .ఈ పాత్ర కోసం మాజీ మిన్నెసోటా గవర్నర్ జెస్సీ వెంచురా, టీవీ హోస్ట్ మైక్ రోవ్‌లతో సహా పలువురిని పరిగణనలోనికి తీసుకున్నారు.గత వారం కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో జరిగిన ర్యాలీలో సిలికాన్ వ్యాలీ న్యాయవాది నికోల్ షానహన్‌ను ఎంపిక చేసినట్లుగా రాబర్ట్ ప్రకటించారు.

ఆరోగ్యం, కృత్రిమ మేథస్సుపై పనిచేయడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు.

2019 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ( Democratic Party ) అభ్యర్ధిత్వం కోసం తులసి గబ్బార్డ్ ప్రయత్నించి విఫలమయ్యారు.ఈ నెలలో విడుదల కానున్న ‘‘ "For Love of Country: Leave the Democrat Party Behind " అనే పుస్తకంలో తులసి పార్టీ నుంచి తన నిష్క్రమణ ఎలా జరిగిందన్నది వివరించనున్నారు.యూఎస్ ఆర్మీ రిజర్వ్స్‌లో లెఫ్టినెంట్ కల్నల్ అయిన తులసి గబ్బార్డ్.

ఇరాక్, కువైట్‌లలో రెండు సార్లు మోహరించారు.హవాయి ఆర్మీ నేషనల్ గార్డ్‌తో ఇండోనేషియాలో యాక్టివ్ డ్యూటీ కోసం 2020లో అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి ఆమె రెండు వారాల పాటు గైర్హాజరయ్యారు.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?

కాగా.అధ్యక్ష ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్ధిగా రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్ దిగడంతో అమెరికన్ రాజకీయాలు వేడెక్కాయి.పోల్స్ ప్రకారం .బైడెన్‌‌తో( Biden ) పోలిస్తే కెన్నెడీ రాకతో ట్రంప్ విజయావకాశాలు తీవ్రంగా దెబ్బతింటాయట.ఇటీవలి వరకు డెమొక్రాట్‌గా కొనసాగుతున్న రాబర్ట్ గతేడాది అక్టోబర్‌లో స్వతంత్ర అభ్యర్ధిగా అధ్యక్ష రేసులోకి వచ్చారు.

Advertisement

ఆయన నిర్ణయం ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంటున్నారు.ఎందుకంటే ఆయనకు డెమొక్రాట్లు , రిపబ్లికన్ల నుంచి పెద్ద ఎత్తున మద్ధతుదారులు వున్నారు.దీనికి తోడు ఆయన వ్యాక్సిన్‌లకు వ్యతిరేకం, స్వతహాగా న్యాయవాది.

తాజా వార్తలు