రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ( Congress Party ) తీవ్ర కసరత్తు చేస్తుంది.ఇందులో భాగంగా వచ్చే నెల 6 లేదా 7వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్లాన్ చేసింది.
ఈ మేరకు తుక్కుగూడలో ( Tukkuguda ) సభ కోసం కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తుంది.
ఈక్రమంలోనే తుక్కుగూడలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ‘ జనజాతర’( Janajatara ) సభగా నామకరణం చేశారు.కాగా ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో( Rahul Gandhi ) పాటు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు.అదేవిధంగా జనజాతర సభా వేదికపై నుంచి రాహుల్ గాంధీ కాంగ్రెస్ గ్యారెంటీలను ప్రకటించనున్నారు.