జిల్లా విద్యాధికారిని కలిసిన టిటియూ నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జిల్లాకు నూతనంగా వచ్చిన డిఇఓ ఏర్పుల రమేష్ కుమార్ ని తెలంగాణ టీచర్స్ యూనియన్(టిటియు) నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, యూనియన్ డైరీ ని అందించిఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో డిఇఓ రమేష్ కుమార్ మాట్లాడుతూ ఎస్ఎస్ సి ఫలితాల్లో జిల్లాలో 100% ఫలితాలు సాధించి జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచేందుకు ఉపాధ్యాయులు కష్టపడి పనిచేయాలని, విద్యార్థులకు విద్యాబోధనను అందించి కృషి చేయాలని కోరారు.

అనంతరం టి టి యు జిల్లా అధ్యక్షులు కొండికొప్పుల రవి మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించే విద్య అభివృద్ధి కార్యక్రమాల్లో ఉపాధ్యాయ సంఘాలను సమన్వయం చేసుకొని పనిచేసి జిల్లాకు మంచి పేరు తేవాలని, ఉపాధ్యాయుల సమస్యలను విద్యార్థుల సమస్య పరిష్కరించేందుకు కృషి చేయాలనీ డీఈవో ని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తడకల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

TTU Leaders Met The District Education Officer ,TTU Leaders,District Education O
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

తాజా వార్తలు