ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రాజకీయ పునరావాస కేంద్రం అని మరోసారి సీఎం జగన్ మరోసారి స్పష్టం చేశారని విమర్శించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారుడిగా శరత్ చంద్రారెడ్డి ఉన్నారన్న పురంధేశ్వరి కేతన్ దేశాయ్ కూడా ఎంసీఐ కుంభకోణంలో దోషిగా నిరూపించబడ్డారని తెలిపారు.అటువంటి వ్యక్తులను టీటీడీ బోర్డులోకి తీసుకోవడం సరికాదన్నారు.
ఈ క్రమంలోనే తిరుమల పవిత్రతను మసకబరిచే విధంగా ఉన్న టీటీడీ బోర్డు నియామకాలను ఖండిస్తున్నామని వెల్లడించారు.