ఇకపై ఈజీగా తిరుమల కొండపై గదుల కేటాయింపు..!

తిరుమల వెంకన్నని దర్శనం చేసుకునే వారు అక్కడ ఏర్పాటు చేసిన రూమ్స్ ఫెసిలిటీని వాడుకుంటారని తెలిసిందే.

ఇదివరకు గదుల కోసం భక్తులకు ఎక్కువ సమయం పట్టేది కాని ఇప్పుడు చాలా తక్కువ టైం లో గదులు తీసుకునేలా టీటీడీ ఏర్పాటు చేసింది.

సాధారణ భక్తులకు గదుల కేటాయింపునకు 6 చోట్ల రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.ఇదివరకు ఇన్ని చోట్ల రిజిస్ట్రేషన్ అందించలేదు.

అందుకే ఇప్పుడు ఈ ఆరు చోట్ల భక్తులు వారికి కావాల్సిన రూమ్స్ ల కోసం రిజిస్ట్రేషన్ జరిపించుకోవాల్సి ఉంటుంది.జిఎన్సీ, బాలాజీ బస్టాండ్, కౌస్తుభం, సీ.ఆర్.ఓ, ఎం.బీసీ, రాం భగీచ వద్ద రిజిస్ట్రేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఈ కేంద్రాల వద్ద తమ పేర్లు నమోదు చేసుకుంటే వారికి ఎస్.ఎం.ఎస్ ద్వారా గదుల సమాచారం వస్తుంది.ఎస్.ఎం.ఎస్ రాగానే నగదు చెల్లించి రూమ్స్ పొందేలా ఏర్పాటు చేశారు.టీటీడీ కొత్తగా ఈ ఆరు కేంద్రాలను ప్రారంభిస్తుంది.

ఈ నెల 12న ఉదయం 8 గంటలకు ఈ రిజిస్ట్రేషన్ కేంద్రాలు ప్రారంభిస్తారని తెలుస్తుంది.కరోనా టైం లో ప్రస్తుతం భక్తుల తాకిడి తక్కువగా ఉన్నా కరోనా ఉదృతి తగ్గితే మళ్లె తిరుమలలో భక్తులతో కిటకిటలాడుతుంది.

Advertisement

ఆ టైం లో కొత్తగా ఏర్పరిచే రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఉపయోగపడతాయని చెప్పొచ్చు.

బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు
Advertisement

తాజా వార్తలు