పంచాయతీ సెక్రటరీల నియామకాలపై 'హైకోర్ట్' సీరియస్

తెలంగాణాలో ఇటీవల విడుదల చేసిన పంచాయతీ సెక్రటరీల నియామకాలపై హైకోర్టు సీరియస్ అయ్యింది.జూనియర్‌ పంచాయతీ సెక్రటరీ నియామకాల్లో స్పోర్ట్స్‌, వికలాంగుల కోటాని విస్మరించడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది.

ఈ విషయంపై బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి.95 శాతం స్పోర్ట్స్‌, వికలాంగుల వాటా సరి చేసిన తర్వాతే మళ్లీ ఫలితాలను విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.పంచాయతీ సెక్రటరీ నియామకాలపై స్టే ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన వి​జ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది.

అంతే కాకుండా.ప్రశ్నాపత్రంలో దొర్లిన తప్పులపై, 14 ప్రశ్నలను తెలుగులో కాకుండా ఇంగ్లీష్‌లో ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో తెలియజేస్తూ.పూర్తి అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

చేసిన తప్పులను ఒప్పుకోకుండా ఎందుకు మేనేజ్‌ చేస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.కోర్టు అనుమతి లేకుండా నియామక పత్రాలను ఇవ్వవద్దని హైకోర్టు సూచించి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

ఏంటి భయ్యా ఇది నిజమేనా? సానియా మీర్జా, షమీ పెళ్లిచేసుకున్నారా?
Advertisement

తాజా వార్తలు