మొటిమలు మచ్చలు పోయి ముఖం అందంగా మారాలా.. అయితే ఈ సీరం మీకోసమే!

సాధారణంగా కొందరి ముఖం మొటిమలు( pimples ) మచ్చలతో నిండిపోయి ఉంటుంది.వాటిని వదిలించుకోవడం కోసం రకరకాల క్రీములు వాడుతుంటారు.

తరచూ ఏవేవో ఫేస్ మాస్క్ లు వేసుకుంటూ ఉంటారు.మొటిమలు, మచ్చల్లేని చర్మాన్ని పొందడం కోసం నానా తంటాలు పడుతుంటారు.

అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ సీరం చాలా బాగా సహాయపడుతుంది.ఈ సీరం ను కనుక వాడితే మొటిమలు మ‌చ్చ‌లు పోయి ముఖం అందంగా మారడం ఖాయం.

సీరం తయారీ కోసం ముందుగా ఒక చిన్న కప్పు హాట్ వాటర్ తీసుకుని అందులో ఒక గ్రీన్ టీ బ్యాగ్ ( Green tea bag )వేసి అరగంట పాటు వదిలేయాలి.ఈ లోపు ఒక కీర దోసకాయను ( Green cucumber )సన్నగా తురుముకుని జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఐదు టేబుల్ స్పూన్లు గ్రీన్ టీ, ఐదు టేబుల్ స్పూన్లు కీరా దోసకాయ జ్యూస్, రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel ) మరియు హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.దాంతో మన సీరం రెడీ అవుతుంది.

ఈ సీరంను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు మరియు ఉదయం స్నానం చేయడానికి గంట ముందు తయారు చేసుకున్న సీరం ను ముఖానికి అప్లై చేసుకోవాలి.రోజుకు రెండుసార్లు ఈ న్యాచురల్ సీరం ను వాడితే ముఖంపై ఎంతటి మొండి మొటిమలు మచ్చలు ఉన్న క్రమంగా తగ్గుముఖం పడతాయి.

స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

అలాగే ఈ సీరం చర్మాన్ని అందంగా కాంతివంతంగా మారుస్తుంది.స్కిన్ ఏజింగ్ ను ఆలస్యం చేస్తుంది.పొడి చర్మాన్ని రిపేర్ చేస్తుంది.

రామ్ కి సక్సెసులు రావాలంటే ఇదొక్కటే దారి...
Women Health : ఈ ఆరోగ్య సమస్యలను ఆడవాళ్లు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు..!

కాబట్టి మ‌చ్చ‌లు పోయి ముఖం అందంగా మెరిసిపోవాలని భావిస్తున్న వారు తప్పకుండా ఇప్పుడు తప్పకుండా సీరం ను తయారు చేసుకొని వాడేందుకు ప్రయత్నించండి.

Advertisement

తాజా వార్తలు