మిమ్మల్ని అందంగా మార్చే కొన్ని ఫేస్ ప్యాక్‌లు గురించి తెలుసా? మీ ఇంట్లోనే తయారు చేసుకోండిలా!

మనలో చాలామంది ఒక ఏజ్ వచ్చేసరికి మెుటిమలతో అనేక సమస్యలను ఎదుర్కొంటూ వుంటారు.అందులో పిల్లకాని అమ్మాయిలైతే లోలోపల చాలా భయాందోళనకు గురవుతుంటారు.

తమకి పెళ్లి కాదేమో, లేదంటే తమని ఎవరూ ఇష్టపడరేమో అన్నట్టు లోలోపల కుమిలిపోతూ వుంటారు.అయితే ఈ సమస్య ఒక్క అమ్మాయిలదే కాదు, అబ్బాయిలు కూడా అదే సమస్యలు ఎదుర్కొంటారు.

ఏం చేయాలో తెలియక తికమక పడుతుంటారు.బయట వున్న బ్యూటి పార్లర్ కి వెళ్లాలంటే భయం.వారు ఫేస్ ప్యాక్‌లు పేరిట వేలకు వేలు దోచేస్తారు.అయితే మీకు మీరుగా ఇంట్లోనే తయారు చేసుకొనే ఫేస్ ప్యాక్‌లు గురించి తెలుసుకుందాం.

ఇందులో మొదటిది "ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్." దీని గురించి చాలామందికి తెలుసు.దీనికోసం మీరు 2 టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టికి తగినంత రోజ్ వాటర్‌ యాడ్ చేసి కలిపితే సరిపోతుంది.

Advertisement

తరువాత ఆ మిశ్రమాన్ని ముఖం మీద అప్లై చేసి, 15-20 నిమిషాలు పాటు ఉంచి కడిగేస్తే సరిపోతుంది.ఈ ఫేస్ ప్యాక్ ఆయిల్ ను గ్రహించి, మొటిమలను తగ్గించడంలో మీకు సహకరిస్తుంది.

ఇక రెండవది "వేప, పసుపు ఫేస్ ప్యాక్." ఇక్కడ మీరు పిడికెడు వేప ఆకులను గ్రైండ్ చేసి, 1/2 టీస్పూన్ పసుపు పొడి, తగినంత నీళ్లతో కలిపి పేస్ట్ లా చేసుకొని తరువాత ముఖం మీద రాసుకుని 15-20 నిమిషాలు ఉంచండి.

ఇది మీకు డిటాక్సిఫై చేయడానికి సహాయపడుతుంది.

ఇందులో మూడవది "నిమ్మ, తేనె ఫేస్ ప్యాక్." దీనికోసం 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ తేనె కలిపి, ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాలు ఉంచితే సరిపోతుంది.ఈ ఫేస్ ప్యాక్ ఆయిల్ ను తొలగించి, మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.

నిర్మాతల కోసం పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి.. ఇంద్ర రీరిలీజ్ వెనుక ఇంత జరిగిందా?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020

ఇక నాల్గవది "యాపిల్ సైడర్ వెనిగర్, క్లే ఫేస్ ప్యాక్." దీనికోసం మీరు 1 టేబుల్ స్పూన్ క్లే పౌడర్‌ని 1 టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్, తగినంత నీళ్లతో కలిపి పేస్ట్ లా తయారు చేసి ముఖం మీద అప్లై చేసి, 10 నుంచి 15 నిమిషాలు ఉంచి కడిగితే మీ చర్మం మెరుస్తుంది.

Advertisement

ఇక చివరగా "బొప్పాయి, తేనె ఫేస్ ప్యాక్." గురించి చెప్పుకోవాలి.దీనికోసం 1/2 పండిన బొప్పాయిని మెత్తగా చేసి, 1 టేబుల్ స్పూన్ తేనెతో కలిపి, ముఖం మీద అప్లై చేసి.15 నుంచి 20 నిమిషాలు ఉంచి కడిగేస్తే సరి.ఈ ఫేస్ ప్యాక్ ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి, మొటిమలను తగ్గించడానికి సహాయపడుతుంది.

తాజా వార్తలు