తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు హాట్ టాపిక్ గా మారుతున్న పరిస్థితి ఉంది.అయితే ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి తెలిసిందే.
అయితే హుజురాబాద్ లో విజయం సాధించడం ఇటు టీఆర్ఎస్ కు, బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారిన పరిస్థితి ఉంది.అయితే ఈ నెల హుజూరాబాద్ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుండడంతో ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల ఫోకస్ ఇప్పుడు హుజూరాబాద్ వైపు పడింది.
అయితే ఎన్నికలు అన్నప్పుడు పరస్పర ఆరోపణలకు దిగడం అన్నది సర్వ సాధారణమైన విషయం.అయితే కొన్ని రకాల విమర్శలు నిజంగా ఏదో జరగబోతున్నదనే సంకేతాలు కూడా ఇచ్చినట్టు అవుతుంది.
అయితే తాజాగా హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై మంత్రి కొప్పుల ఈశ్వర్ సంచలన ఆరోపణలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ఈ నెల 12, 13 వ తేదీలో టీఆర్ఎస్ పార్టీని అభాసు పాలు చేసి రాజకీయ లబ్ధి పొందడానికి ఈటెల రాజేందర్ బీజేపీ పెద్ద ఎత్తున కుట్ర పన్నారని, టీఆర్ఎస్ కార్యకర్తలు తనపై దాడి చేసినట్లుగా చిత్రీకరించి ఆసుపత్రిలో చేరి టీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేక భావం వచ్చేలా వాతావరణాన్ని క్రియేట్ చేసి ఎన్నికలో గెలుపొందాలనే ఆలోచన చేయడం బాధారకరమని మంత్రి కొప్పుల అన్నారు.అయితే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది.దుబ్బాక ఎన్నికల్లో కూడా రఘునందన్ రావు చేతికి పట్టీ తో సానుభూతి రాజకీయం చేసి గెలిచాడని ఆ ప్లాన్ ని హుజూరాబాద్ లో కూడా అమలు చేయబోతున్నారని అయితే ప్రజలు ఇటువంటివి నమ్మబోరని మంత్రి కొప్పుల అభిప్రాయ పడ్డారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక సమరం ఇంకా ఎలాంటి విషయాలకు దారి తీస్తుందనేది చూడాల్సి ఉంది.