జెడ్పీ ఎన్నికలలో ఏకగ్రీవం టీఆర్ఎస్ వ్యూహం! కాంగ్రెస్ ఆ అవకాశం ఇస్తుందా

జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకి రంగం సిద్ధం అయ్యింది.నామినేషన్ల ప్రక్రియ షురూ అయ్యింది.

ఇక టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే జిలా, మండల పరిషత్ ఎన్నికలపై పూర్తి స్థాయిలో ద్రుష్టి సారించడంతో పాటు ఇప్పటికే టీఆర్ఎస్ జెడ్పీ, ఎంపీ చైర్ పర్శన్ లని ఫైనల్ చేసింది.దీంతో పాటు ఎన్నికలు ఏకపక్షంగా లేదంటే, పోటీ లేకుండా చేసుకోవడం ద్వారా\ రాష్ట్రం మొత్తం తమ ఆధిపత్యం చూపించాలని టీఆర్ఎస్ పార్టీ ఆలోచనలో ఉంది.

ఇక కేసీఆర్ టార్గెట్ ని కొడుకు కెటీఆర్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు.ఈ నేపధ్యంలో టీఆర్ఎస్ పార్టీ నామినేషన్ల ప్రక్రియ జోరు చూపిస్తుంది.

ఇక దీనికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో ఎలాంటి ముందడుగు లేకుండా స్తబ్దుగా ఉండటం అర్ధం కాని విషయం గా ఉంది.ఇక ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ పై పోటీ చేసిన గెలవడం కష్టం అని ఫిక్స్ అయ్యి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగేందుకు ఎవరు ముందుకి రావడం లేదనే టాక్ బలంగా వినిపిస్తుంది.

Advertisement

దీంతో ఈ సారి వీలైనన్ని స్థానాలలో ఏకగ్రీవంగా టీఆర్ఎస్ జెడ్పీలని సొంతం చేసుకునే విధంగా కెటీఆర్ వ్యూహ రచన చేసినట్లు తెలుస్తుంది.మరి టీఆర్ఎస్ వ్యూహానికి కాంగ్రెస్ నుంచి ఎంత వరకు పోటీ ఉంటుంది అనేది ఆ పార్టీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది అని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

ఏపీ ఎన్నికల ప్రచారానికి మోదీ.. రెండు రోజుల పర్యటన..!!

Advertisement

తాజా వార్తలు