సికింద్రాబాద్: బుద్ధ భవన్ లో చీఫ్ ఎలాక్ట్రోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ ను కలిసిన టీఆర్ఎస్ నేతలు శ్రీనివాస్ రెడ్డి, గట్టు రామచంద్రరావు. మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… రాజ్ న్యూస్ ఛానల్ లో హరీష్ రావు వీడియో ను మార్ఫింగ్ చేశారు.
ఆ వీడియో వలన మాకు వ్యతిరేక ప్రచారం జరుగుతుంది కావునా ఆ వీడియో ను తొలగించాలని కోరుతున్నాము.రాజ్ న్యూస్ ఛానల్ పై చర్యలు తీసుకోవాలని కోరాము.
టీఆర్ఎస్ నాయకులు గట్టు రామ్ చందర్ రావు మాట్లాడుతూ… ఒక తప్పుడు వార్తను వక్రీకరించి రాజ్ న్యూస్ యూ ట్యూబ్ లో ఉంచారు.రాజ్ న్యూస్ బీజేపీ ఛానల్.
హరీష్ రావు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కి ఓటు వేయాలని మేము ఎలా చెపుతాము.హరీష్ రావు పై పెట్టిన తప్పుడు వీడియో ను డిలీట్ చేయాలి.
ఐటి కి సంబంధం లేకుండా కొత్త అకౌంట్ లను ఓపెన్ చేశారు.ఓటర్ ల ఫోన్ నెంబర్ లను తీసుకుని దుబ్బాక లో వేసినట్టు ఇక్కడ కూడా ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు వేస్తున్నారు.
ఛత్తీస్ గడ్ నుండి 400 కొత్త దొంగ సిమ్ లను తీసుకు వచ్చి వాటి ద్వారా డబ్బులు ఓటర్ లకు వేస్తున్నారు.