సరికొత్త ప్రచారానికి తెరలేపిన టీఆర్ఎస్...అదేంటంటే?

తెలంగాణ రాజకీయాలు మధ్య మాటల తూటాలు పేలుతున్న పరిస్థితి ఉంది.

అయితే టీఆర్ఎస్ తరువాత రెండో ప్రత్యామ్నాయ స్థానం కోసం బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్న పరిస్థితుల్లో రాజకీయాలు హాట్ హాట్ గా మారిన పరిస్థితి ఉంది.

అయితే వరుస ఉప ఎన్నికల్లో గెలుపొందుతూ ఊపు మీదున్న బీజేపీ ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది.అయితే రోజు రోజుకు టీఆర్ఎస్ కు కఠిన పరిస్థితులు ఎదురవుతున్న పరిస్థితులలో టీఆర్ఎస్ ఇక ఆత్మరక్షణలో పడినట్లు తెలుస్తోంది.

అయితే ఈ సమయంలో టీఆర్ఎస్ కూడా ఇక యాక్టివ్ గా సోషల్ మీడియా ప్రచారానికి సిద్దమైంది.

అయితే తెలంగాణ ను మరల దోచుకొని తినడానికి ఇటు ఆంధ్రా పెత్తందారుల నాయకులు, గుజరాతీ వ్యాపారులకు కొమ్ము కాసే నాయకులు ఎదురు చూస్తున్నారని ఇక వారి చేతుల్లో పడితే ఇక తెలంగాణ తన అస్తిత్వాన్ని కోల్పోవడమే కాకుండా తెలంగాణ సంపదను అంతా కూడా బడా వ్యాపారుల చేతిలో పెడతారని ఇన్ని ఏళ్లుగా మనం కొట్లాడి సాధించుకున్న తెలంగాణను మనమే నాశనం చేసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని కావున టీఆర్ఎస్ పార్టీ ఉంటేనే తెలంగాణకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని తమ పార్టీ అధికారిక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది.అయితే బీజేపీతో పోలిస్తే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విషయంలో టీఆర్ఎస్ కాస్త వెనుకబడి ఉందనే చెప్పవచ్చు.అయితే ఒకప్పడు ప్రెస్ మీట్ ల ద్వారా ప్రజల్లోకి విమర్శలు, ప్రతి విమర్శలు ప్రజల్లోకి బలంగా వెళ్ళే పరిస్థితి ఉండేది.

Advertisement

కాని ఇప్పుడు మెజారిటీ శాతం మంది ప్రజలు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు కావున సోషల్ మీడియా ద్వారా పార్టీ వాయిస్ బలంగా వెళ్లకపోతే ఏ పార్టీకయినా కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు