Sandeep Reddy Vanga : ముద్దు లేనిదే వంగా సినిమా లేదు.. రష్మిక, రణబీర్ ముద్దు సీన్ పై భారీ ట్రోల్స్!

అర్జున్ రెడ్డి ( Arjun Reddy ) సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ( Sandeep Reddy Vanga ) ఇదే సినిమాని బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రీమేక్ చేశారు.అయితే అక్కడ కూడా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈయన ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు.

 Trolls On Rashmika Mandanna Lip Lock Scenes-TeluguStop.com

ఇక హిందీలో అర్జున్ రెడ్డి సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో సందీప్ రెడ్డి బాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్థిరపడ్డారు.అయితే ఈయన తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్గా యానిమల్ ( Animal ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి పోస్టర్ ట్రైలర్ పాటలు కూడా ఆద్యంతం సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.


Telugu Animal, Arjun Reddy, Bollywood, Liplock, Ranbir Kapoor, Sandeepreddy, Tro

ఇక తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి పోస్టర్ కనుక చూస్తే రష్మిక రణబీర్ కపూర్ లిప్ లాక్( Rashmika Ranbir Lip Lock ) ఉన్నటువంటి ఒక పోస్టర్ ను విడుదల చేశారు.విమానంలో ప్రయాణిస్తూ వీరిద్దరూ ఇలా లిప్ లాక్ లో మునిగిపోయి ఉన్నటువంటి పోస్టర్ విడుదల చేయగా ఇది కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.ఈ మధ్యకాలంలో ఇలాంటి లిప్ లాక్ సీన్స్( Lip Lock Scenes ) ఉండడం సినిమాలలో సర్వసాధారణం అయింది.

అయితే ఈ సినిమాలో మాత్రం ఇలాంటి సన్నివేశాలు మరో లెవెల్ లో ఉన్నాయని స్పష్టంగా అర్థం అవుతుంది.అయితే ఈ పోస్టర్ పై ఎంతో మంది నెటిజెన్స్ వివిధ రకాలుగా స్పందిస్తూ భారీగా ట్రోల్స్ చేస్తున్నారు.


Telugu Animal, Arjun Reddy, Bollywood, Liplock, Ranbir Kapoor, Sandeepreddy, Tro

ఇలా రణబీర్ కి నువ్వు లిప్ లాక్ ఇస్తే విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) ఏం కావాలి అంటూ కామెంట్ చేయగా మరి కొందరు మాత్రం ఈ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కావడంతో సినిమాలో ఈ మాత్రం లేకపోతే ఎలా అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చే సినిమాలు అన్నింటిలో కూడా ఇలాంటి లిప్ లాక్ సన్ని వేషాలు ఉంటాయి.అర్జున్ రెడ్డి సినిమాలో కూడా ఏ స్థాయిలో ఉన్నాయో మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే పలువురు సందీప్ రెడ్డి సినిమా అంటేనే ముద్దులు లేకుండా ఆయన సినిమా చేయలేరేమో అందుకే ఇలాంటి కిస్ సన్నివేశాలను హైలెట్ చేస్తూ ఉంటారు అంటూ భారీగా ఈ ఫోటోలపై ట్రోల్స్( Trolls ) చేస్తున్నారు.

ఇప్పటివరకు రెండు బాలీవుడ్ సినిమాలలో నటించిన రష్మికకు అనుకున్న స్థాయిలో హిట్ మాత్రం పడలేదు ఇక ఈ సినిమా కనుక హిట్ అయితే ఈమె బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా వెలగడం ఖాయం అటు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube