బాలయ్య భగవంత్ కేసరి ట్రైలర్ పై కామెంట్స్ చేసిన పరచూరి?

నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna ) వీరసింహారెడ్డి సినిమా తర్వాత అనిల్ రావిపూడి ( Anil Ravupudi ) దర్శకత్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరి ( Bhagavanth Kesari ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19వ తేదీ విడుదలకు సిద్ధమైంది.

 Parachuri Gopalakrishnan Interesting Comments On Bhagavanth Kesari Trailer , Par-TeluguStop.com

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది.

Telugu Anil Ravupudi, Balakrishna, Sreeleela, Tollywod, Trailer Review-Movie

ఇక ఈ సినిమా ట్రైలర్ వీడియో పై తాజాగా సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ( Parachuri Gopala Krishna ) చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా పరచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ రెండు నిమిషాల పాటు ఉన్న ట్రైలర్ చూస్తేనే సినిమా ఏంటో స్పష్టంగా అర్థమవుతుందని పరుచూరి తెలిపారు.సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక ట్రైలర్ ద్వారా చూపించడం గొప్ప టాలెంట్ అని ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి పై కూడా ప్రశంసలు కురిపించారు.

ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే కనుక సినిమా మొత్తం ఒక తండ్రి కూతురి మధ్య సాగే సినిమా అని స్పష్టంగా అర్థం అవుతుంది.

Telugu Anil Ravupudi, Balakrishna, Sreeleela, Tollywod, Trailer Review-Movie

అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ లో చాలా మార్పులు కనిపిస్తున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది.సాధారణంగా ఒక సినిమా మంచి విజయం సాధిస్తే దాని తర్వాత వచ్చే సినిమాపై కూడా ఎన్నో అంచనాలు ఉంటాయి.కానీ భగవంత్ కేసరి సినిమా ట్రైలర్ తో ఎలాంటి అనుమానాలు లేకుండా సినిమాపై భారీ అంచనాలనే పెంచేసిందని పరుచూరి వెల్లడించారు.

ఈ సినిమా కథ బాలయ్యకు సరిగ్గా సరిపోయిందని ఈయన వెల్లడించారు ఇక ఈ సినిమాలో బిడ్డ ముందు తండ్రి నిలబడితే వాడే వంద దేవుళ్ళ లెక్క అంటూ బాలకృష్ణ చెప్పే డైలాగ్ ఎంతో అద్భుతంగా ఉంది అంటూ ఈ ట్రైలర్ పై పరుచూరి తన అభిప్రాయాన్ని తెలియజేయడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు కూడా పెరిగిపోయాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube